ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ - ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు - అర్హతలు ఇవే! - LIC SCHOLARSHIP SCHEME

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ గోల్డన్‌ జుబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2024ను ప్రారంభించింది. ఇంతకీ ఎవరు ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు?

lic_scholarship_scheme
lic scholarship scheme (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 8:27 PM IST

LIC Golden Jubilee Scholarship Scheme 2024:ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎల్​ఐసీ (Life Insurance Corporation of India) స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. గోల్డన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2024 పథకం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు తగిన నగదు ప్రోత్సాహకం అందించనుంది. ఈ విషయాన్ని ఎల్‌ఐసీ స్వయంగా వెల్లడించింది. ఎవరెవరు అర్హులు, దరఖాస్తు తేదీ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందులో వెల్లడించింది.

ఉన్నత విద్య చదవాలనుకొనే వారికి జనరల్‌ స్కాలర్‌షిప్‌లు:2021-22, 2022-23, 2023 -24 విద్యా సంవత్సరాలలో 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈ స్కాలర్​షిష్‌న‌కు అర్హులవుతారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో కనీసం 60% మార్కులు సాధించైనా ఉండాలి లేదంటే సమానమైన సీజీపీఏ (Cumulative Grade Point Average) గ్రేడ్‌ కలిగి ఉండాలి. 2024 - 25లో ఉన్నత విద్య చదవాలనుకొనే విద్యార్థులకు ఎల్​ఐసీ జనరల్‌ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, డిప్లొమో, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్‌ కోర్సులు, ఐటీఐ లాంటి వివిధ కోర్సులు చదవాలనుకున్నా ఎల్​ఐసీ ఈ నగదు భరోసా కల్పిస్తుంది.

డిసెంబర్‌ 8వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ:స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ స్కీమ్ (Special Girl Child Scholarship Scheme) కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థినులకు రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్‌/ 10+2/ ఏదైనా విభాగంలో డిప్లొమో కోర్సు చేయాలనుకొనే వారు ఈ ప్రత్యేక స్కాలర్​షిప్​కి దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌ఐసీ www.licindia.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ​ స్కీమ్​కి ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్‌ గడువు తేదీ డిసెంబర్‌ 22న ముగియనుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కుటుంబ అర్హత, స్కాలర్‌ షిప్‌ ఎంత రానుంది వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్కీమ్​కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

రాష్ట్రంలో కార్పొరేటు గురుకులాలు - కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం

హీరోలు సినిమాల్లో కాదు ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారు: పవన్‌ కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details