ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు - రాష్ట్రానికి శుభవార్త - Rammohan Naidu charge as Minister - RAMMOHAN NAIDU CHARGE AS MINISTER

Kinjarapu Rammohan Naidu Took Charge as Union Minister: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు,కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. గత పథకాలను కొనసాగిస్తూ మరిన్ని పథకాలు తీసుకొస్తామని, భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని అలాగే విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 1:36 PM IST

Updated : Jun 13, 2024, 2:26 PM IST

Kinjarapu Rammohan Naidu Took Charge as Civil Aviation Union Minister :కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు.

అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పౌరవిమానయాన బాధ్యత అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్‌లో అత్యంత చిన్న వయస్సులో ఉన్న తపై బాధ్యత పెట్టారని, యువతపై ప్రధానికి ఉన్న నమ్మకమేంటో అర్థమవుతుందని కొనియాడారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. సాంకేతికత వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తా స్పష్టం చేశారు. విమానాశ్రయాల నిర్మాణానికి నిధులను త్వరితగతిన తీసుకుంటామని తెలిపారు.

కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు - రాష్ట్రానికి శుభవార్త (ETV Bharat)

విమానయాన రంగాన్ని సామాన్యులకు మరింత చేరువ చేస్తాం: రామ్మోహన్ నాయుడు - Civil Aviation Minister

భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తాం :2014లో బాధ్యతలు చేపట్టిన అశోక్‌ గజపతిరాజు మంచి పునాదులు వేశారని, ఉడాన్‌ స్కీమ్‌ కూడా అశోక్‌ గజపతిరాజు హయాంలోనే వచ్చిందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. అనుభవం కోసం సింధియా నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నానని తెలిపారు. గత పథకాలను కొనసాగిస్తూ మరిన్ని పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా గర్వించేలా పని చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చారు. విజనరీ నాయకులు చంద్రబాబు, మోదీ నుంచి చాలా నేర్చుకున్నానని మరోసారి తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుకూ రెక్కలు - ‘ఉక్కు’భవిష్యత్తు మారనుందా? ఏపీ ప్రజల కొత్త ఆశలు - AP Hopes on Bhogapuram Airport

'విమానయాన శాఖ మంత్రిగా నేను చేసే పని అదే!'

Last Updated : Jun 13, 2024, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details