Kadapa Women Problems In Gulf Emotional Video :ఏజెంట్ల వల్ల ఎంతో మంది మహిళలు గల్ఫ్ దేశాలలో నానా అగచాట్లు పడుతున్నారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇంకా ఏజెంట్ల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కడపకు చెందిన ఓ మహిళ ఎనిమిది నెలల కిందట సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ మహిళ పెట్టే వేధింపులు భరించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వీడియోను బాధితురాలు కడపకు పంపించారు. తనను కడపకు పంపించాలని మంత్రి లోకేశ్‌ను ఆమె వేడుకున్నారు.
Women Trapped in Saudi Seeking For Help :సౌదీ అరేబియాలో ఉండే ఇండియా ఎంబసీ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని బంగ్లాదేశ్‌కు సంబంధించిన వారి గదిలో ఉంటూ తలదాచుకుంటున్నానని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు కడప రవీంద్ర నగర్‌కు చెందిన షకీలా. ఆమెకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు చేశారు. ఈ క్రమంలో అప్పులు కావడంతో వాటిని తీర్చుకునేందుకు ఎనిమిది నెలల కిందట కడపకు చెందిన ఏజెంట్ సహాయంతో సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ మహిళ వద్ద షకీలా భానును పనికి పెట్టారు ఏజెంట్. కానీ ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో షకీలాను కొట్టడం కొరకడం చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తుందని బాధితురాలు వాపోయింది.