ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్రా రవీందర్‌రెడ్డిని కడప తీసుకొచ్చిన పోలీసులు - VARRA RAVINDER REDDY ARREST

వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు

Varra Ravinder Reddy Arrest
Varra Ravinder Reddy Arrest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 9:40 AM IST

Updated : Nov 11, 2024, 1:48 PM IST

Varra Ravinder Reddy Arrest : వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్త, సోషల్‌ మీడియా సైకోగా పేరొందిన వర్రా రవీందర్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. మూడు రోజుల కిందట అతడిని కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జగన్​ను ప్రతిపక్షాలు విమర్శించిన ప్రతిసారి వారిపైఅసభ్యకరమైన పోస్టులు పెట్టి, పైశాచిక ఆనందం పొందేవాడు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, అనితతో పాటు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపైనా వర్రా రవీందర్‌రెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టాడు.

వర్రా రవీందర్​రెడ్డిపై కడప, మంగళగిరి, పులివెందుల, రాజంపేటతో పాటు హైదరాబాద్‌లో సుమారు 30 కేసులు నమోదయ్యాయి. దళితుడిని దూషించాడనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీందర్‌రెడ్డిని నేడు కడప పోలీసులు అదుపులోకి తీసుకొని చింతకొమ్మదిన్నె పోలీస్​స్టేషన్​కు తరలించారు. రవీందర్​రెడ్డి పారిపోవడానికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు ఉదయ్, సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. వర్రా రవీందర్‌రెడ్డిని ఎస్పీ విద్యాసాగర్ విచారిస్తున్నారు. అనంతరం కడప కోర్టులో హాజరు పరచచనున్నారు.

వర్రా రవీందర్‌రెడ్డిని కలిసిన అతని భార్య, సోదరుడు : మరోవైపు పోలీసులు అదుపులో వర్రా రవీందర్​రెడ్డి ఉన్నాడనే విషయం తెలుసుకున్న ఆయన భార్య కళ్యాణి, అతని సోదరుడు మలికార్జున్​రెడ్డి పోలీస్ స్టేషన్​కి చేరుకున్నారు. అతడిని వారు కలిశారు. తన భర్తను గత వారం రోజుల నుంచి పోలీసులు ఎక్కడ దాచి పెట్టారనే విషయం కూడా తెలియదని కళ్యాణి వాపోయింది. చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్​లో ఉన్నట్లు మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. తన భర్తకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం పోలీసులదే బాధ్యతని కళ్యాణి వ్యాఖ్యానించారు. తన సోదరుడిపై ఇప్పటికే ఇప్పుడే కేసులు నమోదు చేస్తున్నారని మల్లికార్జున్​రెడ్డి తెలిపారు. గతంలో ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదని ఆయన చెప్పారు.

వర్రా రవీందర్‌రెడ్డికి ఆ పార్టీ నుంచే ప్రాణహాని : బీటెక్ రవి

కడప ఎస్పీ బదిలీ - సీఐ సస్పెండ్ - 'వర్రా'పై కనికరం చూపినందుకు ఫలితం

Last Updated : Nov 11, 2024, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details