తెలంగాణ

telangana

ETV Bharat / state

విశ్రాంత ఇంజినీర్లతో సమావేశమైన జస్టిస్ పీసీ ఘోష్ - గోదావరి నదీ జలాలపై వివరాలు సేకరణ - PC Ghose Meeting Retired Engineers - PC GHOSE MEETING RETIRED ENGINEERS

Justice PC Ghose Meeting With Retired Engineers : కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోవడానికి న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విశ్రాంత ఇంజినీర్లతో హైదరాబాద్​లో సమావేశమయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం చేపట్టడంపై కమిషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. వారి ద్వారా వివరాలను సేకరించనున్నారు. గోదావరి జలాల విషయమై విశ్రాంత ఇంజినీర్ల కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది.

KALESHWARAM PROJECT INQUIRY
Justice PC Ghose Meeting With Retired Engineers (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 1:28 PM IST

Justice PC Ghose Meeting With Retired Engineers: కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విశ్రాంత ఇంజినీర్లతో హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో గోదావరి జలాల వినియోగంపై ఐదుగురు విశ్రాంత ఇంజినీర్ల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. విశ్రాంత ఇంజినీర్లు అనంత రాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, శ్యాం ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Justice PC Ghose Inquiry Update : ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను ఇటీవల శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాల ఎత్తిపోత సబబు కాదని కమిటీ సూచించిందని దాన్ని తొక్కిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని అన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై కమిషన్ ఆరా తీస్తున్నది. అందుకు సంబంధించిన అంశాలను విశ్రాంత ఇంజనీర్ల నుంచి తెలుసుకోనుంది.

'ప్రాణహిత - చేవెళ్ల ఎత్తిపోతలను కాదని కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారు' - KALESHWARAM PROJECT INQUIRY UPDATE

Kaleshwaram Project Inquiry Update :కమిటీ నివేదికలోని అంశాలు, వాటిపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి సారించారు. కమిటీ లేవనెత్తిన అంశాలు, చేసిన సిఫార్సులు, వాటిపై ప్రభుత్వ చర్యల గురించి కమిషన్ వాకబు చేస్తోంది. అందులో భాగంగా విశ్రాంత ఇంజనీర్లతో జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ సమావేశమయ్యారు. వారి నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కమిషన్​ కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మించిన సంస్థ ప్రతినిధులతో సమావేశమయింది. వారితో పాటు ప్రస్తుత ఇంజినీర్లతో, నిపుణులతో కూడా సమావేశమయి విచారణ చేసి వివరాలు సేకరించింది. పూర్తి వివరాలు తెలుసుకున్న తరవాతే నివేదిక విడుదల చేస్తామని కమిషన్​ ఇప్పటికే తెలిపింది. ఈ నెల 27వ తేదీలోపు అన్ని అఫిడవిట్లు వచ్చాక, 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్లేషించి తదుపరి కార్యాచరణ చేపట్టనుంది.

''కమిషన్​' ఏం అడిగినా, మనమంతా ఒకే సమాధానం చెప్పాలి' - కాళేశ్వరంపై విచారణలో 'దృశ్యం' సీన్​ రిపీట్ - KALESHWARAM PROJECT INQUIRY UPDATE

ABOUT THE AUTHOR

...view details