NTR Awareness on Drug Addiction : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి యువత సహకరించాలంటూ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్‌కు ఆడిక్ట్ అయి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటుున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్‌కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
'జీవితం చాలా విలువైనది, రండి నాతో చేతులు కలపండి. మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది' అని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో డ్రగ్స్‌కు ఆకర్షితులు కావడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని సూచించారు.
భారతీయుడు-2 మూవీ టీమ్‌కు తెలంగాణ సీఎం అభినందనలు-ఎందుకో తెలుసా? - CM Revanth Reacts on Bharateeyudu 2
సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ విజ్ఞప్తి :ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ కార్యక్రమంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి అంటూ వచ్చే వారికి ఆయన ఓ షరతు పెట్టారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై రెండు నిమిషాల అవగాహన వీడియో చిత్రీకరించాలని సూచించారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని తెలిపారు.
సే నో టూ డ్రగ్స్ అంటూ విజయ్ దేవరకొండ విజ్ఞప్తి :ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలుడ్రగ్స్ రహిత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ, సీనియర్ నటుడు మోహన్ బాబు సైతం డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్‌కు సహకరిస్తూ వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ వల్ల యువత తమ జీవితాలను నాశం చేసుకోవద్దని సూచించారు. యువత బాధ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 'సే నో టూ డ్రగ్స్' అంటూ పిలుపునిచ్చారు.
'ఇకపై అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన - Anti Drugs and Cyber Safety