International Experts Team Observation of Polavaram Project:పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న నిపుణుల బృందం ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2లో సేకరించిన మట్టి, రాతి నమునాలను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు, మ్యాప్‌లను చూశారు. నిపుణుల బృందానికి నమూనాల నాణ్యతను ఇంజినీర్లు వివరించారు.
'నమూనాలు పరిశీలిస్తూ, నాణ్యతను అంచనా వేస్తూ'- పోలవరంలో నిపుణుల పరిశీలన - Polavaram Project - POLAVARAM PROJECT
International Experts Team Observation of Polavaram Project: పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈసీఆర్‌ఎఫ్‌లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించిన నిపుణులు వివిధ కోణాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 12:30 PM IST
|Updated : Jul 2, 2024, 1:52 PM IST
అంతర్జాతీయ నిపుణులు డివిడ్ బి.పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్ తదితరులు ఇవాళ, రేపు పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు చేసిన పరిశీలనలో నిపుణుల్లో కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో, ఇంకా ఏమైనా పరీక్షలు చేయించాలా అని అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు.
ఆ ఆలోచన సరికాదు - నీళ్లలో ఉన్నా ఏం కాదు - Polavaram Diaphragm Wall condition