Indian Government Launches 4th Nuclear Submarine : అణు శక్తికి పదునుపెట్టుకోవడంలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖపట్నం తీరంలో నౌకాదళం అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన నాలుగవ జలాంతర్గామి ఎస్‌ఎస్‌బీఎన్ (SSBN)ని ఆవిష్కరించినట్లు సమాచారం. విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో జలాంతర్గామికి సంభందించిన కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. దామగుండంలో వీఎల్‌ఫ్(VLF) రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే ఈ కార్యక్రమం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇప్పటికే ఈ సంవత్సరం ఆగస్టులో ఎస్‌ఎస్‌బీఎన్ అరిఘాత్‌ను భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నౌకాదళానికి అందజేశారు. వచ్చే 2025 సంవత్సరంలో ఈ శ్రేణిలో నాలుగో సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్(INS) అరిధమాన్‌ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శత్రువులను ఎదుర్కోవడంలో ఈ జలాంతర్గాములు మెరుగైన పాత్ర పోషిస్తాయని నాడు నేవే అధికారులు వెల్లడించారు.
ఇండియా ఇక సూపర్ స్ట్రాంగ్! రూ.1.45 లక్షల కోట్ల ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ - Defence Acquisition Council
సాధారణంగా దేశ భద్రతా కారణాల రీత్యా వీటిని తొలుత కోడ్ నేమ్‌లతో పిలుస్తారు. ఇందులో భాగంగానే ఐఎన్‌ఎస్ చక్రకు ‘ఎస్1’ అని పేరు ఇవ్వగా, ఎస్2గా అరిహంత్, ఎస్3గా అరిఘాత్, ఎస్4గా అరిధమాన్ ఉన్నాయి. తాజాగా ఆవిష్కరించిన సబ్‌మెరైన్‌కు సైతం ఎస్4* అని కోడ్ నేమ్ ఇచ్చారు. ఈ సబ్‌మెరైన్‌కు త్వరలోనే అధికారిక పేరు ఇవ్వనున్నారు. ఈ న్యూక్లియర్ సబ్ మెరైన్‌ను దాదాపు 75 శాతం వరకూ స్వదేశీ టెక్నాలజీతో తయారుచేశారు.
3,500 కి.మీ రేంజ్ ప్రయాణించగల కే-4 న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణులను అమర్చే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ క్షిపణులను నిట్టనిలువుగానూ ప్రయోగించే విధంగా తయారు చేశారు. ఎస్‌ఎస్‌బీఎన్ శ్రేణిలో తొలి తరం అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌లో 750 కిలోమీటర్ల రేంజ్ గల కే-15 న్యూక్లియర్ క్షిపణులను అమర్చే వీలుండగా ఆ తర్వాత అప్‌గ్రేడ్ చేసిన సబ్‌మెరైన్లలో కే-4 క్షిపణులను అమర్చే సామర్థ్యం ఉంది.
విశాఖలో నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి పర్యటన - కమాండ్ కార్యకలాపాలపై సమీక్ష
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు- 10మంది నేవీ సిబ్బంది మృతి- విన్యాసాలు చేస్తుండగా! - Malaysia Helicopter Crash