Hydra Focus on Traffic Control :హైదరాబాద్‌లో ఏదైనా పని ఉందంటే సమయం, ఎన్ని కిలోమీట్లరు, ఇవన్నీ లెక్కేసుకుని వచ్చిన దానికంటే గంట ముందే ప్రయాణం ప్రారంభించాలి. కారణం ట్రాఫిక్. లేకుంటే పని సమయం అయిపోయినా మనం మాత్రం ఇంకా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉంటాం. నగరంలో అంత ట్రాఫిక్ ఉంటుంది మరి. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హైడ్రా రంగంలోని దిగుతోంది. వాహన రద్దీ సమస్యతో పాటు ఫుట్‌పాత్, రహదారి ఆక్రమణలపై నగర ట్రాఫిక్ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.
"హైడ్రా కూల్చివేతలు" - ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పాలసీ!
ఇరు విభాగాలు సంయుక్తంగా పని చేసి :హైడ్రా, ట్రాఫిక్ విభాగాలు కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించికి ఆక్రమణలను తొలగించనున్నాయి. హైడ్రా ఆధీనంలోని విపత్తు స్పందన బృందాలు ట్రాఫిక్ నియంత్రణలో పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు విభాగాలు కలిసి పనిచేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ నిర్ణయించారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులతో కలిసి పనిచేసేందుకు డీఆర్‌ఎఫ్ బృందాలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. హైడ్రా అధికారులు, నగర ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లతో రంగనాథ్, విశ్వప్రసాద్ గురువారం సమావేశమయ్యారు. నెలకోసారి ఇరు విభాగాలు కలిసి భేటీ కావాలని నిర్ణయించారు.