ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలో ధనవంతులే ఎక్కువ - ఎవరినీ ఉపేక్షించం: రంగనాథ్​

ఆక్రమణలలో అన్ని పార్టీల వారున్నారు - ఏ ఒక్క‌రినీ వ‌ద‌లమని హైడ్రా కమిషనర్​ స్పష్టం

Hydra Police Stations Starts Soon
Hydra Police Stations Starts Soon (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 9:58 PM IST

Hydra Police Stations Starts Soon : తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహా నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిలో పేదల కంటే ధనవంతులు, సంపన్నులే ఎక్కువగా కనిపిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆక్రమణదారుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేదని లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. బేగంపేటలోని ఓ హోటల్​లో జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో అర్బన్ బయోడైవర్సిటీ అనే అంశంపై నిర్వహించిన జాతీయ‌ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ : ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, చెరువుల పరిరక్షణ, పునరుద్దరణ చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టామని, లోటస్ పాండ్​లో ఏకంగా ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందని తెలిపారు. త్వరలోనే హైడ్రాకు పోలీస్ స్టేషన్ రాబోతుందని, హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని వెల్లడించారు. జీవవైవిధ్యానికి ఊతమిచ్చేలా చెరువుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఛైర్మన్ అచలేందర్ రెడ్డి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details