Hyderabad Child Missed At 12 Years And Police Found After 10 Years in Uttar Pradesh :ఏళ్ల తరబడి కనిపించకుండా అదృశ్యమై పోయిన పలువురిని తెలంగాణ మహిళా భద్రత విభాగం అధీనంలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఏహెచ్‌టీయూ) పోలీసులు గుర్తిస్తున్నారు. చాలాకాలంగా కనిపించకుండా పోయిన వారిని గుర్తించేందుకు ఏహెచ్‌టీయూతోపాటు ఇదే విభాగంలోని షీ సైబర్ ల్యాబ్ కృషి చేసిందని, ఈ క్రమంలోనే 27 కేసులు కొలిక్కివచ్చాయని మహిళా భద్రత విభాగం డీజీపీ శిఖాగోయెల్ వెల్లడించారు.
‘తెలంగాణలో 2024 నవంబరు నాటికి 22,870 అదృశ్యం కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 19,191 కేసులు కొలిక్కివచ్చాయని తెలిపారు. కేసులను కొలిక్కి తీసుకురావడంతో జాతీయ స్థాయి సగటు 51.5 శాతం కాగా తెలంగాణాది 84.25 శాతం’ అని శిఖాగోయెల్ తెలిపారు.
12 ఏళ్లప్పుడు ఖలీల్‌ఘోరి ఇప్పుడు అభినవ్‌సింగ్ :హైదరాబాద్ కంచన్‌బాగ్‌కు చెందిన 12 ఏళ్ల మహ్మద్ ఖలీల్‌ఘోరి 2014 ఆగస్టు 18న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే కేసును ఏహెచ్‌టీయూ (AHTU)కు బదిలీ చేశారు. ఓపెన్-సోర్స్ టూల్స్ పరిజ్ఞానంతో దర్యాప్తు ఆరంభించిన అధికారులు ఖలీల్‌ఘోరి ఆధార్‌కార్డు కొత్త మొబైల్ నంబరుతో అప్‌డేట్ అయినట్లు గుర్తించారు. ఆ ఫోన్ నంబరు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కాన్పుర్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సనేహీసింగ్‌దిగా నిర్ధారించుకున్నారు.
"ఎంతపని చేశావు స్వరూపా" - ఇంటికి వెళ్లి చాక్లెట్ ఇచ్చి నమ్మించావుగా!