Lokesh Praja Darbar 33rd Day :ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు భారీగా స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామునుంచే ఆయణ్ని కలిసేందుకు జనం బారులు తీరుతున్నారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 33వ రోజు లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు.
ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు : ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. ఏలూరు జిల్లా చొప్పరామన్నగూడెంలోని చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు లోకేశ్‌కు మొరపెట్టుకున్నారు. ఎలాగైనా స్థలాన్ని కాపాడాలని మంత్రిని కోరారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడికి వైద్యం సాయం అందించాలని ఓ కుటుంబం లోకేశ్‌కు విజ్ఞప్తి చేసింది. తన కుమార్తె మానసిక వికలాంగురాలని తనకు పింఛన్ ఇప్పించాలని ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ లోకేశ్‌ను కోరింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న విష్టుసారథి సొసైటీ డ్రైవర్లకు గత ప్రభుత్వం పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించకుండా అన్యాయం చేసిందని వారు వాపోయారు. ఈ విషయాన్ని లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా లడ్డూ, గుర్తింపుకార్డులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేశారని తెలిపారు. తమను రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి లోకేశ్ భరోసా ఇచ్చారు