Huge Joinings to TDP Under Nara Lokesh: శృంగవరపుకోట వైసీపీ నుంచి తెలుగుదేశం లోకి జాతీయప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో వైసీపీ నేతలు భారీగా చేరారు. ఉండవల్లి లో ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి సహా 150మంది వైసీపీ ముఖ్యనేతలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. వీరిలో 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు, 5 గురు కన్వీనర్లతో సహా 150 మంది పార్టీ ముఖ్యనేతలను పసుపు కండువాలు కప్పి లోకేశ్ పార్టీలోకి ఆహ్వానించారు.
విధ్వంసపాలనతో ప్రజల ఆశలకు జగన్ గండికొట్టాడని లోకేశ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తెస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలకు జిల్లాలే వైసీపీ ఖాళీ అవుతున్నాయని దుయ్యబట్టారు. ఇక ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నారని తేల్చిచెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో కలసి పనిచేసేవారికి ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చినవారిని కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన వైసీపీ నేతలు
జగన్ పని ఎప్పుడో అయిపోయిందని జనం చెప్పేశారు. వైనాట్ 175 అనేది దింపుడుకల్లం ఆశ. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా వైసీపీ దారుణ పరాజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టేశారు. అందుకే మునిగిపోయే వైసీపీ పడవ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు దూకేస్తున్నారు.
"పాదయాత్ర వలన ప్రజలకు దగ్గర అవుతాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుంటాం. దానివలన అధికారంలోకి వచ్చిన తరువాత మెరుగైన సేవలు అందించగలుగుతాం. జగన్ కూడా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. పాదయాత్ర చేసిన తరువాత మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన రెండు రోజులలోనే విధ్వంసం మొదలైంది అని మాకు అర్థం అయ్యింది". - నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ - కడప,గుంటూరు టీడీపీలో భారీగా చేరికలు
వైఎస్సార్ జిల్లా కమలాపురంలో రోజురోజుకు టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చింతకొమ్మదిన్నె మండలం సీఎంఆర్ పల్లికి 80 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. సీఎంఆర్ పల్లి వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీతో కమలాపురానికి వచ్చిన వారు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అంగడి వీధిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నరసింహారెడ్డి పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలకు ఆకర్షితులైన 80 కుటుంబాలు వైసీపీని వీడి పుత్తా నరసింహారెడ్డి టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరిన కుటుంబాలను పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించిన నరసింహారెడ్డి, రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నరసింహారెడ్డి అన్నారు. రాష్ట్రంతో పాటు నియోజకవర్గం కూడా బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని నరసింహారెడ్డి పిలుపునిచ్చారు.
టీడీపీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది: పుత్తా నరసింహారెడ్డి
టీడీపీలోకి భారీగా వలసలు - కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్