Donations to AP CMRF :రాష్ట్రంలోవరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి నియోజకవర్లంలోని పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.2.97 కోట్ల విరాళం ఇచ్చారు. జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ రూ.2 కోట్లు, సెయిల్ సెమ్ కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రూ.50 లక్షలు, ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.47 లక్షలు ఇచ్చారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలోవారు సీఎం చంద్రబాబును కలిసి చెక్‌ను అందజేశారు. దాతలందరికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వరద బాధితుల కోసం ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు మరోసారి ఆపన్న హస్తం అందించారు. ఇప్పటికే ఎపీ ఎన్జీవో తరఫున ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన వారు, మరో రోజు జీతాన్ని కూడా సీఎం సహాయనిధికి ఇచ్చారు. ఈ మేరకు ఏపీబీసీఎల్ తరఫున కోటి రూపాయల విరాళం ప్రకటించారు. మొత్తంగా ఎక్సైజ్ శాఖ నుంచి రూ.2.70 కోట్లు అందించారు
Electricity Department Employees JAC Leaders Donation : విజయవాడ వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగులు అండగా నిలిచారు. ఒక్క రోజు జీతం రూ.10.61 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో వారు సీఎం చంద్రబాబును కలిసి చెక్‌ను అందించారు. విద్యుత్ ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందించడంతోపాటు బాధితులకు ఆర్థిక సహాయమూ అందించారని మంత్రి గొట్టిపాటి కొనియాడారు.
సీఎంకు భారీగా విరాళాలు అందించిన దాతలు :మరోవైపు విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.3 కోట్లను కియా ఇండియా సీఈవో కబ్ డాంగ్ లీ అందించారు. నారాయణ విద్యాసంస్థల నుంచి రూ.2.50 కోట్ల చెక్కును సింధూర, శరణి, పునీత్, ప్రేమ్‌సాయి ఇచ్చారు. దేవీ సీఫుడ్స్ తరఫున పొట్రు బ్రహ్మానందం, రమాదేవి రూ.2 కోట్లు అందజేసింది.
Actor Simbu Donations To Flood Victims :అవంతి ఫీడ్స్ నుంచి అల్లూరి ఇంద్రకుమార్, నిఖిలేష్ రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్ధం తమిళ నటుడు శింబు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.3 లక్షల చొప్పున విరాళం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.