ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో మొదలైన ఓటింగ్ - మంగళగిరి నియోజకవర్గంలో తొలి హోమ్​ ఓటింగ్ - home voting started in AP

Home Voting Started in Andhra Pradesh: హోమ్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మొదటి ఓటు పడింది. 85 సంవత్సరాలు దాటిన ఓటర్లకు, 40 శాతం అంగవైకల్యం చెందిన వారికి ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ కేటగిరికి చెందిన దాదాపు 452 ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారిని రాజకుమారి చెప్పారు. ఇంటి వద్దకే ఓటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 15 బృందాలను నియమించామని తెలిపారు.

Home Voting Started in Andhra Pradesh
Home Voting Started in Andhra Pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 1:35 PM IST

Home Voting Started in Andhra Pradesh: సాధారణ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మొదటి ఓటు పడింది. నియోజకవర్గంలో 85 సంవత్సరాలు దాటిన ఓటర్లకు, 40 శాతం అంగవైకల్యం చెందిన వారికి ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ కేటగిరికి చెందిన దాదాపు 452 ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారిని రాజకుమారి చెప్పారు. ఈనెల మూడు, నాలుగు, ఐదు తేదీలలో మొదటి విడతలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశం వినియోగించుకోని వారికి మరొకసారి ఏడు, ఎనిమిది తేదీలలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

ఏపీలో మొదలైన ఓటింగ్ - మంగళగిరి నియోజకవర్గంలో తొలి హోమ్​ ఓటింగ్ (ETV Bharat)

ఇంటి వద్దకే ఓటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారిని రాజకుమారి 15 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారి, సూక్ష్మ పరిశీలకులు, పోలీసు ఎస్కార్ట్ ఉండనున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు ఇంటి వద్దకే ఓటింగ్ ప్రక్రియపై ఎన్నికల అధికారిని రాజకుమారి అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ ఓట్లన్నీ జూన్ 3వ తేదీనే లెక్కిస్తామన్నారు.

మీ వద్ద ఓటింగ్ స్లిప్ లేదా? ఈజీగా ఆన్​లైన్​లో డౌన్ లోడ్ చేసుకోండిలా! - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details