Home Minister Anitha Comments On Jagan Security : ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ మోహన్ రెడ్డికి 950 మందితో భద్రత ఎందుకని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశించారు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినప్పటికి మాజీ సీఎం అని గౌరవించి జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ భద్రతపై ఆమె మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి అధికారింలో ఉన్నప్పుడు 950 మంది భద్రతా సిబ్బందిని నియమించుకున్నారని తెలిపారు. దాని వల్ల ప్రతి నెల దాదాపుగా రూ. 6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. ఎంత ప్రజా ధనం వృథా అయ్యిందో ప్రజలు గ్రహించాలని కోరారు.
58 మందితో జడ్ ప్లస్ భద్రత :ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఒక శాసన సభ్యుడు మాత్రమేనని తెలిపారు. కానీ మాజీ సీఎం అని గౌరవించి 58 మందితో జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. దీనికే ప్రతినెల రూ. 30 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అది సరిపోక 950 మంది భద్రత కావాలని జగన్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్నప్పడు విదేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర పోలీస్ భద్రత ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైఎస్ భారతికి 2+2, విజయమ్మకు 2+2 భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఎటువంటి భద్రత తీసుకోలేదని వంగలపూడి అనిత తెలిపారు.
జడ్‌ప్లస్ ఉన్నా- జగన్‌కు అభద్రతాభావం ఎందుకు?: మంత్రి లోకేశ్ - Lokesh tweet on Jagan security
గ్రామ జనాభాతో సమానం :సాధారణంగా వీఐపీ భద్రత 100 మంది సిబ్బందికి మించదని తెలిపారు. కానీ, మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల భద్రత వెయ్యి మంది వరకు ఉంటున్నారు. ఇది చిన్న గ్రామ జనాభాతో సమానం అని హోం మంత్రి అనిత వెల్లడించారు. గతంలో "ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్" పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో సెక్యూరిటీ కల్పించిందని ఎద్దేవా చేశారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూడు షిప్టుల్లో 934 మందితో భద్రత ఏర్పాటు చేశారని అన్నారు. ఒక్కో షిఫ్టులో దాదాపు 300 మంది పనిచేసేవారని అనిత గుర్తుచేశారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం రీప్లేస్ : జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించాలని మాజీ సీఎం జగన్ ఈ నెల 5న హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు. జగన్ కోర్టుకెక్కిన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు తాజాగా పలు విషయాలను స్పష్టం చేశాయి. జగన్‌కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం రీప్లేస్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే జగన్ భద్రతా సిబ్బంది సమాచారమిస్తే జామర్ కూడా అందిస్తామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.
జగన్ గన్మెన్లను అడుగుతున్నది భద్రత కోసమా, స్టేటస్ కోసమా?: తులసిరెడ్డి - tulasi reddy on ys jagan security
జగన్ సెక్యూరిటీ పిటిషన్- 3 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు - jagan security petition