ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షంలోనూ ఆగని మీటింగ్​- వాననూ లెక్కచెయ్యని అభిమానులు - Chandrababu speech in RAIN - CHANDRABABU SPEECH IN RAIN

Heavy Rain In Vijayawada: ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.రాజకీయ నాయకులంతా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇన్ని రోజులు మండుటెండలో ప్రచారం సాగించిన నేతలు ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. ఓ వైపు భహిరంగ సభలు, రోడ్​ షోలతో కార్యకర్తలు తీరిక లేకుండా ప్రజల మద్ధతు కూడగడుతుంటే వర్షం ప్రారంభమైంది.

heavy_rain_in_vijayawada
heavy_rain_in_vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 5:45 PM IST

Heavy Rain In Vijayawada:విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్ల పైకి వర్షపు నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కారు మబ్బులు కమ్ముకోవడంతో పట్టపగలే చిమ్మ చీకట్లు వచ్చాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో ఎక్కడి జనం అక్కడే నిలుచిపోయారు. ఉదయం నుంచి వాతావరణం మామూలుగా ఉండి అకస్మత్తుగా పెద్ద ఎత్తున వాన కురిసింది దీంతో జనాలు కొంత అసౌకర్యానికి గురయ్యారు.

Rain Fall in Chandrababu Public Meeting Gannavaran : గన్నవరంలోనూ జోరుగా వర్షం కురుస్తున్నా చంద్రబాబు సభలో ప్రజలు అలాగే ఉన్నారు. వాన పడుతున్నా బాబు ప్రసంగించారు. ప్రచారంలో భాగంగా తరువాత తెలుగుదేశం అధినేత మాచర్ల వెళ్లాల్సి ఉంది. ఓ వైపు వాన జోరందుకుంది. వాతావరణం బాగాలేకున్నా మాచర్ల వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.కానీ ఆఖరి నిమిషంలో చంద్రబాబు మాచర్ల పర్యటన ఆగింపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల మాచర్ల రూట్ క్లిష్టంగా ఉందని, అటవీప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణం సాగించలేమని పైలట్లు తెలిపారు. ఒంగోలు వెళ్లాలన్నా రూట్ డైవర్షన్ తీసుకుంటేనే సాధ్యమని పైలట్లు పేర్కొన్నారు. దీంతో నేరుగా ఒంగోలు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో ఒంగోలు బయలుదేరిన చంద్రబాబు పరిస్థితిని మాచర్ల ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అవకాశాలన్నీ పరిశీలించినా సాధ్యపడలేదు, కనుకే మాచర్ల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెపిపారు. బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని, పల్నాడు ప్రజలు తమ ఓటుతో రౌడీ రాజకీయాలకు గుణపాఠం చెప్పాలని అన్నారు.

రెయిన్​ అలర్ట్​- నాలుగు రోజుల పాటు కూల్​ వెదర్​ - Rain Alert in Andhra Pradesh

Andhra Pradesh rain Alert For Two Days :ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు.రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అకాల వర్షాల కారణంగా కొన్ని చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలో ఈదురుగాలులతో వర్షం కురిసింది.

Unseasonal Rains in Andhra Pradesh:తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, దక్షిణ కర్ణాటక మీదుగా సముద్ర పట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఇది వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెళ్లడించింది.

రాష్ట్రంలో తారాస్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతలు - రాబోయే 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు - temperatures raising extreme

అకాల వర్షంతో రాష్ట్రంలో అల్లకల్లోలం - వందల ఎకరాల్లో దెబ్బతిన్న పసుపు, మొక్కజొన్న పంటలు - Unseasonal Rains in AP

ABOUT THE AUTHOR

...view details