ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"కడుపున మోయకున్నా కంటికిరెప్పలా చూసుకుంటున్నాం - మా బిడ్డల్ని మాకు దూరం చేయొద్దు" - FOSTER PARENTS CRIES FOR THEIR KIDS - FOSTER PARENTS CRIES FOR THEIR KIDS

Child Trafficking Busted In Hyderabad: కడుపున మోయకున్నా గుండెల్లో దాచుకుని చూసుకుంటున్నాం. పేగు బంధం కాకున్నా కంటిపాపలా చూసుకుంటున్నాం. దయ చేసి మా బిడ్డలను తీసుకెళ్లొదంటూ ఓ వైపు తల్లిదండ్రులు రోదిస్తుండగా ఏడాది నుంచి రెండేళ్ల వరకు వారి ఆలానాపాలనాలో పెరిగిన పిల్లల ఏడుపులు. తెలంగాణలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో ఈ దృశ్యాలు అందర్ని కంటతడి పెట్టించాయి.

Child Trafficking in Hyderabad
Child Trafficking in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 1:55 PM IST

Child Trafficking in Hyderabad: అమ్మతనానికి నోచుకోలేని మహిళలు పడే వేదన ఊహించలేనిది. నేటి సమాజం సూటిపోటి మాటలు తట్టుకుని మరీ పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. వారిచేత అమ్మా అని పిలిపించుకుంటూ సంతోషపడుతారు. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని నిరూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఇన్నాళ్లూ కంటికిరెప్పలా కాపాడుకున్న తమ పిల్లలు దూరమైతే ఆ తల్లి గుండె ఎంతలా రోదిస్తుంది. రోజూ తన గుండెలపై తన్నుతూ కేరింతలు కొట్టే చిన్నారిని ఇక తాము చూడలేమనే ఊహ ఆ తండ్రిని ఎంతలా కుంగిదీస్తుంది. కళ్లముందే తమ పిల్లలను తమ నుంచి దూరంగా తీసుకెళ్తుంటే ఆ తల్లిదండ్రుల గుండెకోతను ఆపతరం ఎవరివల్లవుతుంది? ఇలాంటి గుండెను మెలిపెట్టే దృశ్యాలకు వేదికైంది రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణం.

Foster Parents Cries For Their Kids at Rachakonda : "కడుపున తొమ్మిది నెలలు మోయకున్నా గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం. పేగుబంధం కాకున్నా కంటిరెప్పలా కాపాడుకుంటున్నాం దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్న దంపతులు ఓ వైపు. రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులకు రాచకొండ కమిషనరేట్ వేదికైంది.

Child Kidnapping Delhi : రాఖీ కడతానని చిన్నారి మారాం​.. నెలరోజుల శిశువును కిడ్నాప్​ చేసిన తల్లిదండ్రులు.. ఆఖరికి..

Police Caught Child Selling Gang :పసికందులకు అంగట్లో సరకులా ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్‌ గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు. దిల్లీ, పుణెల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని 11 మందిని అరెస్టు చేశారు. వీరు రెండు మూడేళ్లుగా సుమారు 60 మందిని విక్రయించినట్లు తేల్చారు. ప్రస్తుతానికి వారి నుంచి కొనుగోలు చేసిన 16 మందిని పోలీసులు గుర్తించారు. ఆ పిల్లలతో ఆయా తల్లిదండ్రులను పోలీసులు కార్యాలయానికి రప్పించారు.

సదరు దంపతుల నుంచి ఆయా చిన్నారుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిశువిహార్‌కు తరలించేందుకు ప్రయత్నించగా పెంచుకున్న బంధాన్ని విడదీయొద్దంటూ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మహిళలను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు.

బలవంతంగా 16 మంది పిల్లలను వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్తుండగా దంపతులు అడ్డుగా నిలబడ్డారు. సంతానం లేదని బాధతో తెలిసో తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామన్నారు. ఏళ్ల తరబడి పెంచుకుంటున్న తమ పిల్లలను దూరం చేస్తే బతికేదేలంటూ రోడ్లపైనే కూర్చొని గుండెలు పగిలేలా తల్లిదండ్రులు రోదించారు. వీరిలో 12 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు ఉన్నారు.

మరోవైపు చిన్నారుల్ని ఇలా కొనుగోలు చేయడం నేరమని అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి ద్వారానే పిల్లలులేని వారు అప్లై చేసుకోవాలన్నారు. జిల్లాలో ఉండే అధికారులు అఫ్లై చేసుకున్న వారి ఆర్డర్ ప్రకారం ఇస్తామన్నారు. ఈ ప్రక్రియకు రెండేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇతర ఏ పద్దతిలో పిల్లలను కొనుగోలు చేసినా అది చట్టవ్యతిరేకం అవుతుందని చైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్మన్ రాజారెడ్డి తెలిపారు..

కడప రిమ్స్​లో చిన్నారి కిడ్నాప్.. మహిళను పట్టుకున్న సెక్యూరిటీ

ABOUT THE AUTHOR

...view details