ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - GOVERNMENT ORDERS ON AP NEW DGP

డీజీపీగా హరీశ్‌కుమార్‌గుప్తాకు పూర్తి అదనపు బాధ్యతలు - ఈనెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు

GOVERNMENT ORDERS ON AP NEW DGP
GOVERNMENT ORDERS ON AP NEW DGP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 9:18 PM IST

Updated : Jan 29, 2025, 10:54 PM IST

Government Orders On AP New DGP :ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌కుమార్‌ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్‌ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది.

ఆర్టీసీ ఎండీగా రీ ఎంప్లాయ్: ఉద్యోగ విరమణ తర్వాత ద్వారకా తిరుమల రావును ఆర్టీసీ ఎండీగా రీ ఎంప్లాయ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏడాది పాటు ఆయన ఆర్టీసీ ఎండీగా కొనసాగుతారని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది.

Last Updated : Jan 29, 2025, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details