ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

జిల్లాల్లో జరిగే పరిపాలన వ్యవహారాలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

District Incharge Ministers 2024
District Incharge Ministers 2024 (ETV Bharat)

District Incharge Ministers 2024 :ఏపీలోని జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్​లు జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాధ్యతలు తీసుకోలేదు. నలుగురు మంత్రులకు రెండేసీ జిల్లాల చొప్పున ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు తెలుగులో జారీ చేశారు. వారు ఇన్‌ఛార్జిగా ఉండే ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపరమైన వ్యవహారాలను నియమించిన మంత్రులు పర్యవేక్షిస్తారు. ఆయా జిల్లాలకు సంబంధించి సమగ్ర నివేదికలను సీఎం తెలియజేస్తారు. జిల్లాల్లో జరిగే పరిపాలన వ్యవహారాలను మంత్రులే పర్యవేక్షిస్తారు.

జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం (ETV Bharat)

జిల్లాల వారీగా ప్రభుత్వం నియమించిన ఇన్‌ఛార్జి మంత్రులు వీరే..

  • శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్‌
  • పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రిగా అచ్చెన్నాయుడు
  • విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వంగలపూడి అనిత
  • విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా డోలా బాలవీరాంజనేయస్వామి
  • అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణి
  • అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొల్లు రవీంద్ర
  • కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పొంగూరు నారాయణ
  • తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రిగా నిమ్మల రామానాయుడు
  • ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నాదెండ్ల మనోహర్‌
  • పశ్చివ గోదావరి, పల్నాడు జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రిగా గొట్టిపాటి రవికుమార్‌
  • ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా సత్యకుమార్‌ యాదవ్‌
  • కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వాసంశెట్టి సుభాష్‌
  • గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కందుల దుర్గేష్
  • బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొలుసు పార్థసారథి
  • ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి
  • నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఎన్‌ఎండీ ఫరూఖ్‌
  • నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పయ్యావుల కేశవ్‌
  • అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా టీజీ భరత్‌
  • శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రిగా అనగాని సత్యప్రసాద్‌
  • వైఎస్సార్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఎస్‌.సవిత
  • అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా బీసీ జనార్దన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details