ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం గొప్పలు - పండగ రోజూ పేదలకు తప్పని పస్తులు

Goverment Cutting Essential Commodities : తమది పేదల ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం జగన్‌ వారి పొట్టగొడుతున్నారు. పేదలకు అందించాల్సిన నిత్యావసరాలలో భారీ కోతలు విధించి పస్తులు ఉంచుతున్నారు. జగన్‌ పాలనలో కనీసం పండుగలు జరుపుకునే పరిస్థితి లేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిత్యావసరాల పంపిణీ సవ్యంగా జరిగేదని గుర్తు చేసుకుంటున్నారు.

ration_supply
ration_supply

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 7:16 PM IST

ప్రభుత్వం గొప్పలు - పండగ రోజూ పేదలకు తప్పని పస్తులు

Goverment Cutting Essential Commodities : తమది పేదల ప్రభుత్వమని వారి సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెబుతుంటారు. కానీ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు అందించే రేషన్ సరుకుల్లో మాత్రం భారీగా కోతలు విధిస్తున్నారు. అధికారులు కేవలం బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కందిపప్పు, పంచదార ఇతర సరుకుల పంపిణీ మాటను ప్రభుత్వం మర్చిపోయినట్లుందని మహిళలు చెబుతున్నారు. మార్కెట్లో ఆకాశాన్నంటిన నిత్యావసరాలు కొనుగోలు చేయలేక తాము పండగలకు దూరంగా ఉంటున్నామని మహిళలు వాపోతున్నారు.

Few Essential Civic Services : దసరా, దీపావళి, క్రిస్మస్​, సంక్రాంతి పండగలు వెళ్లిపోయాయి. ప్రభుత్వం ఇస్తున్నామనే నిత్యావసర సరకులు ఇచ్చినా చాలా మందికి అందలేదని కృష్ణా జిల్లా మహిళలు వాపోతున్నారు. పేద ప్రజలు ఆకాశాన్నంటిన నిత్యావసర సరకులను కొనుగోలు చేయలేక పండగ రోజున కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్​ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల సరకులను రేషన్​ డీలర్లు ద్వారా పంపీణీ చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ration Mafia In AP: వైసీపీ నాయకుల రేషన్ మాఫియా.. ఎక్కడ పట్టుబడ్డా కేరాఫ్ కాకినాడే

Krishna District :జనవరి నుంచి రేషన్‌ దుకాణాల్లో అందిస్తామన్న కందిపప్పు, గోధుమ పిండి చాలా మందికి అందటం లేదు. అయినా పౌర సరఫరాల శాఖ మాత్రం పేద ప్రజలకు అన్ని రకాల సరకులు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో ఒక్కో కార్డుకు కేజీ చొప్పున కందిపప్పు సరఫరా చేస్తే 526 టన్నుల కందిపప్పు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నెలకు కేవలం 200 టన్నులు మాత్రమే సరఫరా అయింది. ఒక్కో కార్డుదారు అర కేజీ చొప్పున ఇచ్చినా అందరికీ అందే పరిస్థితి లేదు. ఇలా అరకొరగా ఇస్తే కార్డుదారులు నిలదీస్తారని డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

'మేము బీదవాళ్లం.. అన్ని సరుకులు ఇవ్వండి సారూ'

Civil Supply Stopped :ఇంటింటికీ సరకులు తీసుకొచ్చి తామే అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అందులో బియ్యం తప్ప మరేవీ రావడం లేదని మహిళలు అంటున్నారు. ప్రభుత్వం రాయితీపై నిత్యావసరాలు ఇస్తే తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన ధరలతో పండగ రోజూ పస్తులు ఉండాల్సి వస్తోందని తెలిపారు. గతంలో బియ్యం, చింతపండు, గొధుమపిండి, కందిపప్పు, పంచదార ఇచ్చే వారని వాటితో నెలంతా గడిపేవాళ్లమని మహిళలు గుర్తు చేస్తున్నారు.

కందిపప్పు కోసం రేషన్ దుకాణాలకు వెళ్లినా ముందు ఎవరు తీసుకుంటే వారికే అందుతోంది. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నిత్యావసర వస్తువులు సరఫరా చేయకుండా పేదలను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో అందించాలని మహిళలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details