ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణాలతో ఉందో? లేదో? తెలియకుండానే అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు

మహిళను కోరిక తీర్చమని బలవంతం - ప్రతిఘటించడంతో మొక్కల్లోకి లాక్కెళ్లి పాశవికంగా దారుణం

Four Youths Gang Raped A Woman And Threw Her In Canal
Four Youths Gang Raped A Woman And Threw Her In Canal (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Four Youths Gang Raped A Woman And Threw Her In Canal :తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం చేసి ఆపై కాల్వలో పడేసి హతమార్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళ మృతితో బాధిత కుటుంబసభ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఘటనపై కారకులైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.

మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం- మనస్తాపంతో ఆత్మహత్య!

నిర్మానుష ప్రాంతంలోకి లాక్కెళ్లి :తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో 43 ఏళ్ల మహిళను నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్యచేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు చాలా కాలంగా కడియం మండలంలో నివాసం ఉంటున్నారు. నర్సరీల్లో కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, దివ్యాంగురాలైన కుమార్తె ఉన్నారు. గత నెల 15న నర్సరీలో పనులు ముగించుకొని మహిళ తిరిగి ఇంటికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన దేవర ఏసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయప్రసాద్, ఇతర ప్రాంతానికి చెందిన దాసరి సురేష్​లు కోరిక తీర్చమని బలవంతం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో సమీపంలోని మొక్కల్లోకి లాక్కెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఆమె ప్రాణాలతో ఉందో? లేదో కూడా తెలియని పరిస్థితుల్లో దారుణానికి ఒడిగట్టారు. ఆపై రాత్రి 9 గంటల సమయంలో మహిళను పంటకాల్వలో పడేశారు. అప్పటికే ఆమె చనిపోయారా? కాల్వలో పడేసిన తర్వాత మరణించారా? అన్నది పోస్ట్ మార్టమ్ నివేదికలో తేలియాల్సి ఉంది.

మేన కోడలిపై అత్యాచారం - బిడ్డ పుట్టాక మొదలైన వేధింపులు

కాల్వలో మహిళ మృతదేహాం : మహిళ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గత నెల 16న కడియం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలమూరు మండలం చొప్పెళ్ల వద్ద కాల్వలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. నల్లపూసల దండ, గాజులు, రుమాలు తదితర వస్తువుల ఆధారంగా కుటుంబసభ్యులు మృతి చెందిన మహిళను నిర్ధారించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దేవర ఏసును అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గుర్ని స్టేషన్‌కు పిలిపించి విచారించగా దారుణం వెలుగు చూసింది. నిందితులంతా 19 నుంచి 26 ఏళ్ల లోపు వయసు వారేనని డీఎస్పీ భవ్యకిషోర్‌ వివరించారు. వారందర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

తిరుపతి జిల్లాలో దారుణం - చాక్లెట్​ ఇప్పిస్తానని మూడున్నరేళ్ల బాలికపై హత్యాచారం!

నిత్యం మద్యం మత్తులో : నిందితులు గంజాయికి బానిసలై నిత్యం మద్యం మత్తులో ఉండేవారని పోలీసుల విచారణలో స్థానికులు తెలిపారు. మహిళ మృతితో ఆమె కుటుంబీకుల పరిస్థితి దయనీయంగా మారింది. దివ్యాంగురాలైన కుమార్తెకు ఆమె నిత్యం సపర్యలు చేసి అనంతరం పనులకు వెళ్లేది. ఇప్పుడు ఆమె మృతితో దివ్యాంగురాలైన కుమార్తె పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కుటుంబంలో ఇంతటి విషాదాన్ని నింపిన కారకుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

అక్టోబరు 15: మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మహిళ ఎప్పటిలానే నర్సరీ పనులకు వెళ్లారు. ఈ దృశ్యం హైవేపై ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. సాయంత్రమైనా రాలేదు. రాత్రంతా బంధువులు నర్సరీ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
16వ తేదీ:కడియం పోలీస్‌స్టేషన్‌లో మహిళ అదృశ్యం కేసు నమోదు.
17న: ఆలమూరు పరిధి చొప్పెల్ల లాకుల వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యం. కాలి పట్టీ, పొట్ట భాగంలో శస్త్రచికిత్స ఆనవాళ్ల ఆధారంగా కుటుంబీకులు నిర్ధారించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
31:నిందితుల అరెస్టు..రిమాండ్‌.

చర్చిలో ప్రార్థన చేస్తుండగా బ్లేడుతో దాడి చేసిన భర్త - ప్రాణాపాయస్థితిలో భార్య

ABOUT THE AUTHOR

...view details