తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మో!! హోటల్ ఫుడ్డా? నేను రాను బాబోయ్ - ఎంచక్కా ఇంటికెళ్లి తింటాను - FOOD SAFETY VIOLATIONS IN HYDERABAD

Food Safety Task Force Inspections in Restaurants : హైదరాబాద్‌లో హోటళ్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పంజా విసురుస్తున్నారు. వరుస తనిఖీలు చేస్తూ నిర్వాహకులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రమాణాలు పాటించకుండా హోటళ్లు నడిపిస్తున్న వాటిపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.

Food Safety Task Force Inspections in Restaurants
Food Safety Violations In Hyderabad Hotels (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 10:40 AM IST

Updated : Jun 3, 2024, 11:52 AM IST

Food Safety Violations in Hyderabad Hotels :ప్రస్తుత కాలంలో ఎవరకీ క్షణం తీరిక ఉండటం లేదు. కనీసం వండుకుని తినడానికి కూడాచాలామందికి తీరిక ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆన్​లైన్ ఫుడ్ డెలివరీపై ఆధారపడుతున్నారు. మరోవైపు కొందరు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తున్నారు. ఒకప్పుడు హోటల్​లో తినడమంటే ఎగిరి గంతేస్తూ వెళ్లే వారు ఇప్పుడు బయటి ఫుడ్ అంటేనే భయపడుతున్నారు. కారణం గత కొన్ని రోజులుగా తెలంగాణలో వరుసగా హోటళ్లు, రెస్టారెంట్లపై జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.

హైదరాబాద్​లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. వరుసగా తనిఖీలు చేస్తూ ప్రమాణాలు పాటించని హోటళ్లను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు హోటళ్ల తీరును చూసి అధికారులు షాక్​కు గురవుతున్నారు. కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహారపదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయటి ఫుట్ తినాలంటే భయపడుతున్నారు. ఒకపూట కడుపు మాడ్చుకున్నా ఫర్వాలేదు ఇంటికెళ్లి వండుకుని తినాలి అని ప్రజలు నిర్ణయానికి వచ్చేలా రెస్టారెంట్ల తీరు ఉంది.

తాజాగా హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హోటల్‌ అశోకా, కిచెన్‌ ఆఫ్‌ మూన్‌లైట్‌ బార్‌, హైడ్రేట్‌ ది బార్‌, న్యూ ఫిష్‌ల్యాండ్‌ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీటిల్లో గడువు తీరిన ఆహార పదార్థాలు, పాడైపోయిన చికెన్‌ (5 కేజీలు), కారమెల్‌ కలర్, పెసర్లు (10 కేజీలు)ను గుర్తించి వాటిని అధికారులు సీజ్‌ చేశారు. మాంసం నిల్వ ఉంచే ప్రాంతంలో బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు.

శుభ్రత లేని కిచెన్ - పురుగులు పట్టిన ఐస్​క్రీమ్

Food Safety Violations In Hyderabad Hotels :ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు పాటించని లేబుల్‌ లేని కాజు (24 ప్యాకెట్లు), వండటానికి సిద్ధం చేసి ఫ్రిజ్‌లో ఎప్పటి నుంచో నిల్వ ఉంచిన పదార్థాలను సీజ్‌ చేసి నోటీసులు ఇచ్చారు. లక్డీకాపూల్‌లోని హైడ్రేట్‌ ది బార్‌లో ఎక్స్‌పైరీ అయిన చికెన్‌ వింగ్స్‌ (10 కేజీలు), అముల్‌ పీనట్‌, పాస్తా (5 కేజీలు), లేబుల్‌ లేని బీబీక్యూ సాస్‌ గుర్తించి సీజ్‌ చేశారు. హోటల్‌ న్యూ ఫిష్‌ల్యాండ్‌లోని కిచెన్‌లో ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. సింథటిక్‌ ఫుడ్‌ కలర్‌, మూతలు ఏర్పాటు చేయని డస్ట్‌ బిన్లు, లేబుల్‌ లేని పదార్థాలు సీజ్‌ చేసి నోటీసులు జారీ చేశారు.

ఐస్​క్రీమ్​లో ఫంగస్ - చుట్టూ అపరిశుభ్ర వాతావరణం - భద్రాచలంలో ఆ హోటల్​ సీజ్

హోటళ్లలో ఫుడ్​ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు - పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు గుర్తింపు - Food Safety Officers Raid On Hotels

Last Updated : Jun 3, 2024, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details