Five Acres of Cashew Trees Burnt: వేసవిలో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు రైతులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ముఖ్యంగా మామిడి, జీడి మామిడి తోటల రైతులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అధిక ఎండలకు ఆకులు అన్నీ రాలి ఉండటం కారణంగా చిన్న ప్రమాదం సంభవించినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తాజాగా విజయనగరం జిల్లాలో 5 ఎకరాల జీడి మామిడి తోట దగ్ధమైంది.
విజయనగరం జిల్లా వంగర మండలం వీవీఆర్ పేట సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 5 ఎకరాల జీడి మామిడి తోటలు దగ్ధమయ్యాయి. బుధవారం రాత్రి దారిగుండా వెళ్లే వ్యక్తులెవరో సిగరెట్ తాగి పడేయటంతో మంటలు అంటుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. బుధవారం రాత్రి తోటలో ఎగిసిపడ్డ మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వీవీఆర్ పేటకు చెందిన రైతలు కొట్టు తిరుపతి రావు, సూర్యనారాయణ, జక్కు గణేష్, రమణమ్మలకు చెందిన తోటలు మొత్తం మంటల్లో కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
రెస్టారెంట్లో చెలరేగిన మంటలు- 45మంది మృతి
Fire Accident in Guntur District: గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదం జరిగి ఏడు ఇళ్లు పూర్తిగా దగ్ధమై కట్టుబట్టలతో బాధితులు మిగిలారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని 19వ వార్డు ఎస్టీ కాలనీలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 7 గృహాలు దగ్ధమయ్యాయి. సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఇంటిని చుట్టుముట్టడంతో కుటుంబ సభ్యులంతా పరుగులు తీశారు.
ఇదే సమయంలో ఇంట్లో ఉన్న వంట గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు పక్కనున్న ఇళ్లకు సైతం వ్యాపించాయి. ఈ ఘటనలో మొత్తం 7 ఇళ్లు దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, వారు ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అన్ని గృహాల్లో సుమారు లక్ష రూపాయల వరకు నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. 4 లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లింది.
ఈ విషయం తెలియగానే టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం గురించి బాధితులను తెలుసుకున్నారు. ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయలు అందజేశారు. అదేవిధంగా వైసీపీ అసెంబ్లీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బాధితులను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయలు ఇచ్చారు. తహసీల్దారు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
గాజువాకలోని ఆకాష్ బైజూస్ అకాడమీలో భారీ అగ్నిప్రమాదం