ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత కరెంటు ఇస్తామని మోటార్లకు మీటర్లు ఏంటి ? - ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం - Farmers Protest - FARMERS PROTEST

Farmers Protest Setting Up Electricity Meters for Motors : వ్యవసాయ మోటార్లకు విద్యుత్​ మీటర్లు బిగిస్తున్న సిబ్బందిని అనంతపురం జిల్లా రైతులు అడ్డుకున్నారు. ఉచిత కరెంటు ఇస్తామని మీటర్లు బిగించడం దారుణమంటున్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన మీటర్లను తొలగించాలని డిమాండ్​ చేశారు.

farmers_protest
farmers_protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 3:09 PM IST

ఉచిత కరెంటు ఇస్తామని మోటార్లకు మీటర్లు ఏంటి ? - ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం

Farmers Protest Setting Up Electricity Meters for Motors : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయపురంలో రైతులు ఆందోళన చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్​ మీటర్లు బిగించేందుకు వచ్చిన విద్యుత్​ శాఖ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, రైతుల అనుమతి తీసుకోకుండా మీటర్లు ఎలా బిగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే మోటార్లకు మీటర్లను బిగించిన వాటికి తొలగించాలని డిమాండ్​ చేశారు. వ్యవసాయ పొలాలకు మీటర్లు వద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకొని రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరించారు.

కన్నీరు పెట్టిస్తున్న మిర్చి - 'గిట్టుబాటు' కాలేదంటున్న అన్నదాతలు - Mirchi Farmers

Anantapur District : సీఎం జగన్​ మోహన్​ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మీటర్లు బిగించడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులపై అదనపు భారం పడుతుందని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు బిగిస్తే అదనపు భారం పడుతుందని రైతులు ఆందోళన చేస్తే బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి అలాంటి ఆలోచన కూడా చేయకుండా రైతులపై అదనపు భారం వేస్తున్నారని ఆరోపించారు.

'కళ్ల ముందే పంట ఎండిపోతోంది- సాగునీరు ఇవ్వండి మహాప్రభో' - Farmers Facing Lack Of Irrigation

"రైతులకు ఉదయమే 9 గంటలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. ఇంటికి వచ్చే కరెంటు బిల్లునే కట్టలేక పోతున్నాము. ఇప్పుడు వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగిస్తే రైతుపై అదనపు భారం పడుతుంది" -ఛాయపురం గ్రామ రైతులు

వ్యవసాయ పొలాలకు ఉదయమే 9 గంటల ఉచిత కరెంటు ఇస్తామని గత ఎన్నికల్లో సీఎం జగన్​ హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కరెంట్​ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థం కావడం లేదని రైతన్నలు వాపోతున్నారు. అసలు వ్యవసాయ పొలాలకు కరెంటు 6 గంటలు మించి ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అది కూడా ఉదయం 3 గంటలు ఇస్తే, రాత్రికి ఎప్పుడు ఇస్తారో ఎవరికి అర్థం కావడం లేదని తెలిపారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఇస్తే తాము వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీలు కూడా దొరకడం చాలా కష్టంగా మారిందని పేర్కొన్నారు. వర్షాలు లేక, పంటలు పండించడానికి నానా అవస్థలు పడుతున్నారని రైతన్నలు తెలిపారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని కష్టాల కొలిమిలోకి నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీ ఇచ్చి అన్నదాతలను నిండా ముంచిన అధికారులు- ఆదుకోవాలని వేడుకోలు - Farmers Facing Lack Of Irrigation

ABOUT THE AUTHOR

...view details