Family Suicide Due to Online Betting Debts :లోన్, బెట్టింగ్ యాప్లతో అప్పులు చేసి తీర్చే మార్గం లేక ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మరో కుటుంబం బలైంది. కుమారుడు బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. సంతోషంగా ఉన్న కుటుంబాల పాలిట బెట్టింగ్ యాప్లు యమపాశాలుగా మారుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగణవేని సురేశ్, హేమలతలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కుమారుడు హరీశ్(22) పదో తరగతి వరకు చదివి మానేశాడు. అద్దె ఇంట్లో ఉంటూ కిరాణం దుకాణం నడుపుతున్నారు. వ్యవసాయం, కిరాణం మీద వచ్చే ఆదాయంతో కుటుంబంతో సంతోషంగా ఉండేది. అయితే కరోనా సమయంలో హరీశ్, ఆన్లైన్ బెట్టింగ్, పబ్జీ గేమ్లకు అలవాటు పడ్డాడు. ఇలా ఆడుతూనే దాదాపు రూ.30 లక్షలు అప్పు చేశాడు. కుమారుడు చేసిన అప్పులు తీర్చడానికి తమకున్న ఎకరం వ్యవసాయ భూమిని అమ్మేసి రూ.12 లక్షలు తల్లిదండ్రులు చెల్లించారు. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఇంకా సుమారు రూ.18 లక్షల అప్పు ఉండటంతో ఏం చేయాలో పాలు పోలేదు.
ఆడుకుంటూ అనంతలోకాలకు - ఇద్దరు చిన్నారుల మృతితో శోకసంద్రంలో గ్రామం - Two Children Died at Small Pond