Fake Iphones in Jagdish Market :తెలంగాణలోని ఈ మార్కెట్లో మీకు అతి తక్కువ ధరలలో మీకు నచ్చిన ఫోన్ దొరుకుతుంది. లక్షల రూపాయల ఫోన్ల నుంచి కేవలం 500 రూపాయలకు లభించే ఫోన్ వరకు ఇక్కడ విక్రయిస్తారు. అంతే కాదు ఏ ఫోన్ విడిభాగాలు కావాలన్నా ఇక్కడ అతి తక్కువ ధరకే లభ్యం అవుతుంది. మీ ఫోన్‌కి ఎటువంటి రిపేర్ వచ్చినా, హైదరాబాద్‌లో అతి తక్కువ ధరకు ఎక్కడ బాగు చేస్తారని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే ఎకైన సమాధానం ఆ మార్కెట్ పేరే. అంతలా ఆ మార్కెట్ ఫేమస్ అయింది.
అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. కేవలం మంచిగానే కాకుండా చెడుగా కూడా ఈ మార్కెట్ గురించి చెప్పేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ మార్కెట్‌కి వెళ్తే మోసం చేస్తారంటూ చాలా మంది చెప్తూనే ఉంటారు. ఇటు మంచిగానూ, మరోవైపు చెడుగానూ ఆ మార్కెట్‌కి పేరు ఉంది. మొబైల్ ఫోన్ రిపేర్ చేయడం కోసం వెళితే అక్కడి షాపు వాళ్లు ఎలాంటి స్పేర్ పార్టులు వేస్తారో, ఉన్న పార్టులు తీస్తారో అంటూ సామాజిక మాధ్యమాలలో మీమ్స్ సైతం వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.
అలాగే మన చేతికి మళ్లీ మన ఫోన్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు అంటూ పలువురు జోక్స్ వేస్తూ ఉంటారు. అంతే కాకుండా దొంగ ఫోన్లు కూడా అక్కడ అమ్ముతారు. దొంగతనం చేసిన ఫోన్లను సైతం ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారని అంటుంటారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అది ఏ మార్కెట్ అని. అదే అబిడ్స్‌లో ఉన్న జగదీశ్ మార్కెట్.
ఇప్పుడు తాజాగా ఇక్కడ "ఐఫోన్"లను కూడా విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. ఐఫోన్లు అమ్మితే పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు అనేగా మీ అనుమానం అంతా. ఎందుకంటే అవి నకిలీవి కాబట్టి. వారి నుంచి కోట్లు రూపాయలు విలువ చేసే నకిలీ ఐఫోన్ల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.