Ambati Rambabu Brother Irregularities :గుంటూరు నగరం నడిబొడ్డున పట్టాభిపురంలో మాజీమంత్రి అంబటి రాంబాబు సోదరుడు ఎలాంటి అనుమతులు లేకుండానే ఏకంగా 14 అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి రైల్వే ట్రాక్ పక్కన ఐదు అంతస్తులకు మించి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు లేవు. దీంతో ముందుగా జీ ప్లస్ ఐదు నిర్మాణాలకు రైల్వేశాఖ నుంచి ఎన్ఓసీ తీసుకున్న అంబటి మురళీకృష్ణ ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలుమార్లు రివైజ్డ్ ప్లాన్ పేరిట 14 అంతస్తుల్లో నిర్మాణాలు చేపట్టారు.
పూర్తిస్థాయిలో అనుమతులు లేకున్నా ఐదేళ్లపాటు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడకుండా కట్టడి చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌కు సర్వీస్‌రోడ్డు లేదు. అదేవిధంగా ఎమినిటిస్ బ్లాక్‌లో కల్పించే సౌకర్యాలను ప్లాన్‌లో చూపించలేదు. పైగా ఫీజు బకాయిలు ఉన్నట్లు గుర్తించి గత జులైలో నోటీసులు అందజేశారు. కానీ బిల్డర్ ఇవేమీ పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. రైల్వేశాఖ సమాచారం ఇచ్చినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
Ambati Murali Illegal constructions :బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి 2015లో జీ+5కు మాత్రమే అనుమతులు పొందారు. 2017లో జీ+14కు పర్మిషన్స్ కోరుతూ రివైజ్డ్ ప్లాన్ దరఖాస్తు చేసుకున్నారు. 2023లో ఒక టవర్ డిజైన్ మార్చుకుంటున్నామని మరోసారి రివైజ్డ్‌కు కోసం అనుమతులు కోరారు. 2023 నవంబర్, డిసెంబర్లో ఇందుకోసం అర్జీ చేశారు. అయితే అందుకు అవసరమైన ఆయా పత్రాలను 2024 జులైలోనే అప్లోడ్ చేశారని అప్పుడే పర్మిషన్ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.