Establishing Command Control Center for Public Complaints:ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఇప్పటికే ప్రతి ప్రాంతంలోనూ అవగాహన కల్పిస్తున్నామని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నియోజకవర్గాల వారీగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రజలు ఇతరత్రా సమస్యలు ఉన్న కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికల కోసం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇదే విధంగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వినోద్ కుమార్ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుని ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు తెలపాలన్నారు.
అనంతపురం జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు - సమస్యలపై ఫిర్యాదు చేయాలన్న అధికారులు - Command control center - COMMAND CONTROL CENTER
Establishing Command Control Center for Public Complaints: ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన ఉండాలని ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అన్నారు. నియోజకవర్గాల వారీగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రజలు ఇతరత్రా సమస్యలు ఏమి ఉన్నా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 7:49 PM IST
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫోన్ నంబర్ల వివరాలు
1. 18004258802 (OR) 08554-234122.
2. 18004258803 (OR) 08554-239822.
3. 18004258804 (OR) 08554-231722.
అసెంబ్లీ నియోజకవర్గాల కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ల వివరాలు ఇలా:
1. 148 - రాయదుర్గం : 8495252001.
2. 149 - ఉరవకొండ : 8496357846.
3. 150 - గుంతకల్లు : 8552223355.
4. 151 - తాడిపత్రి : 9642338578.
5. 152 - సింగనమల : 8919003100.
6. 153 - అనంతపురం అర్బన్ : 08554 - 230139.
7. 154 - కళ్యాణదుర్గం : 08497 - 220422.
8. 155 - రాప్తాడు : 8554291001.
ఎన్నికలకు సంబంధించిన ఏ ఫిర్యాదులైనా పైనా ఇచ్చిన ఆ నియోజకవర్గ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. నగదు లావాదేవీలు, కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా చూసేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.