ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిల్టు నగలు, చీరలు కావాలా - కడప ప్రభుత్వాస్పత్రికి వెళ్దాం పదండి - HOSPITAL STAFF PRIVATE BUSINESS - HOSPITAL STAFF PRIVATE BUSINESS

Employee Private Business in Kadapa Government Hospital : వారంతా ప్రతిరోజు ఆస్పత్రిలో విధులకు పక్కాగా హాజరవుతారు. వచ్చిన వెంటనే బిజిబిజీగా మారిపోతారు. కానీ అక్కడ రోగులకు మాత్రం వైద్యం అందదు. అదేందీ ఆస్పత్రికి వస్తారంటున్నారు, వచ్చిన వెంటనే పనుల్లో నిమగ్నమైపోతారని అంటున్నారు. మరీ వాళ్లంతా ఏం చేస్తారనే డౌటూ మీకూ వచ్చిందా ! ఆగండాగండి. అక్కడికే వస్తున్నాం. అది తెలుసుకోవాలంటే ఇదిగో ఈ స్టోరీ చదివేయండి.

Staff Business in Hospital
Staff Business in Hospital (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 9:34 AM IST

Employee Private Business in Kadapa Government Hospital : ప్రజల అనారోగ్యాన్ని అస్వస్థతను నయం చేసే కడప ప్రభుత్వ ఆసుపత్రి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. సిబ్బందిలో చాలామంది రోగులను పట్టించుకోకుండా ఆసుపత్రిల్లోనే చిన్నపాటి దుకాణాలు తెరిచి వ్యాపారులుగా మారిపోయారు. పూసలు, గిల్టు నగలు, చీరలు ఆసుపత్రి బెడ్​పై పెడితే అక్కడ ఉన్న సిబ్బంది పనులు వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇందుకు అధికారులే వారికి ప్రత్యేక గదులూ ఇచ్చారని చెబుతున్నారు. వీరి నిర్వాకం వల్ల రోగులు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆసుపత్రిలో వ్యాపారం :ఆసుపత్రుల్లో విధులు అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఆపదలో వచ్చే వారిని అక్కున చేర్చుకోకపోయినా కనీసం వారికి వైద్యుడి గది, వార్డులకు అక్కడ ఉన్న సిబ్బంది దారి చూపించాలి. కానీ, కడప ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నా వారు మాత్రం ఇవేం పట్టించుకోకుండా పని ప్రదేశంలోనే ఏకంగా దుకాణాలు తెరిచారు.

విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రికి సుస్తీ - Maharaja Sarvajana Hospital

ఓపీ కోసం రోగులు ఎదురుచూపులు : ఆసుపత్రి ఐపీ విభాగంలోని ఓపీ రిజిస్ట్రేషన్‌ కేంద్రంలో పని చేసే ఓ ఉద్యోగి పూసలు, గిల్టు నగలు తెచ్చి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నా సిబ్బందికి విక్రయిస్తున్నాడు. సదరు ఉద్యోగి ఓ బెడ్‌ను కిందేసి దానిపై నగలు, పూసలు వేయగానే మిగతా సిబ్బంది పనులు వదిలేసి చుట్టూ పోగై కాలక్షేపం చేస్తున్నారు. ఇదే సమయంలో ఓపీ చీటీలు ఎప్పుడిస్తారా అని బయట రోగులు గంటలు తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక్కడ కొందరు నర్సులు అయితే ఏకంగా చీరల దుకాణం తెరిచి, సదరు ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. ఇందుకు అధికారులే వారికి ప్రత్యేక గదులూ ఇచ్చారని పేర్కొంటున్నారు.

రోగులకు శాపంగా గత పాలకుల నిర్లక్ష్యం - అసౌకర్యాలతో అల్లాడుతున్న గిరిపుత్రులు - Lack of Facilities in Govt Hospital

చర్యలు తీసుకుంటాం :ఆసుపత్రిల్లో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని అక్కడికి పిలిచి చీరలు కావాలా అని అడుగుతున్నట్లు సహచరులు తెలిపారు. అత్యవసర సేవలు అందించాల్సిన సిబ్బంది ఇలా ఆసుపత్రిల్లో వ్యాపారాలు చేయడంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి దృష్టికి రోగులు తీసుకెళ్లారు. అందుకు ఆమె పరిశీలించి, చర్యలు చేపడతామని సమాధానం ఇచ్చారు.

మరణించిన భర్త ఆశయాన్ని ఆచరణలో పెట్టిన భార్య - ఆసుపత్రికి రూ.4.50కోట్ల విరాళం - 4 Crores50 Lakhs Donate to Hospital

ABOUT THE AUTHOR

...view details