EC Notices to YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావనతో పాటు వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన ఫిర్యాదులపై ఈ నోటీసులను ఈసీ జారీ చేసింది. వైసీపీ నేత మల్లాది విష్ణు, అవినాష్ రెడ్డి, దస్తగిరి చేసిన ఫిర్యాదుల మేరకు షర్మిలకు నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వీటిని జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
48 గంటల్లో వివరణ ఇవ్వాలి - షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు - EC Notices to YS Sharmila - EC NOTICES TO YS SHARMILA
EC Notices to YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని, 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది.
EC_Notices_to_YS_Sharmila
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 10:15 PM IST