Dumping Yard at Nellore Creates Several Problems to Residents :పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు డంపింగ్ యార్డులు లేకపోవడంతో నెల్లూరు నగరవాసులు నరకం చూస్తున్నారు. నగరంలోని చెత్త మొత్తాన్ని ఒకే చోట డంప్ చేస్తుండటంతో చెత్త పెద్ద గుట్టగా తయారైంది. చెత్తను కాల్చడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి లేదు - నెల్లూరుకు డంప్ గండం - Dumping Yard Problems Nellore
Dumping Yard at Nellore Creates Several Problems to Residents : ఎక్కడ చూసినా చెత్త. గట్టిగ గాలి వీస్తే ఇళ్లలోకి ఎగిరిపడే చెత్త. కొద్ది వానకే దారులలో చేరి నీరు నిలిచిపోతున్న వైనం. వానా కాలం వస్తున్నా డంపింగ్ పెద్ద కొండలా పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నా నెల్లూరు వాసులు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 9:20 AM IST
No Cleanliness Of Dumping Yard in Nellore City :చెత్తపై చిత్తశుద్ధి లేకపోవడంతో నెల్లూరులో లక్షల మంది అనారోగ్యకర వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లలో రోజుకు 350 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. రోజూ వచ్చే చెత్తను వాహనాల్లో ఎక్కించి ఒకే ప్రాంతంలో డంప్ చేసి పెద్ద కొండలా తయారు చేశారు. చెత్తశుద్ధి కేంద్రం కోసం ఐదేళ్ల క్రితం స్థల సేకరణ చేసినా ఇంతవరకు పూర్తి చేయలేదు. చెత్త నుంచి సంపదను సృష్టించాలనే లక్ష్యంగా తెలుగుదేశం హయంలో కార్పొరేషన్ అధికారుల పని చేశారు. వైఎస్సార్సీపీ సర్కార్ దానిపై దృష్టి కేంద్రీకరించలేదు. ఫలితంగా దొంతాలిలో చెత్త కొండలా పేరుకుపోయింది. అయినా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Dumping Yard Problems : చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నగరంలో ఎక్కడా స్వచ్చత కనిపించడం లేదు. మురుగు కాలువల్లో చెత్త భారీగా పేరుకుపోవడంతో వర్షాల సమయంలో వరద నీరు రోడ్ల మీదకు వస్తోందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వానకే చెత్త పేరుకుపోయి రోడ్లపై మురుగునీరు పారుతోందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోపోతే పారిశుద్ద్యంలేక రోగాలు ప్రభలే అవకాశాలు ఉన్నాయని నగర వాసులు ఆవేదన చెందుతున్నారు. వానలకు దోమలు ఈగలు ముసిరి ఆరోగ్యాలు పాడైపోతాయని అధికారులు వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందిచాలని నగరవాసులు కోరుతున్నారు.