Rain Alert in AP : రాష్ట్ర వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచనలు చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అక్కడకక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాలకు అల్లూరి జిల్లా పాడేరు కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి గెడ్డ పొంగి ప్రవహించింది. పైనుంచి కురుస్తున్న వర్షాలకు కొండల మధ్య భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. చేయి చేయి పట్టుకుని ఉద్ధృతమైన నీటి ప్రవాహం మధ్య గిరిజనులు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఇలా సమస్యల సుడిగుండంలో వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు.
Rains in Andhra Pradesh: పొంగిపొర్లుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పాడేరు మండలంలో గల లక్ష్మీపురం పంచాయతీలో పలు గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. పంచాయతీ పరిధిలోని కొడపుట్ గ్రామంలో పీఎం జన్ మన్ పథకంలో వంతెన నిర్మించాలని గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన విజ్ఞప్తులు బుట్టదాఖలు కావడం వల్ల ప్రజలు ఇప్పడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోడపుట్, కేందుగూడ, మవులపుట్, పీవీటీ జి గ్రామాల్లో మొత్తం 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వర్షాకాలం వస్తే చాలు ఈ గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. వరద కారణంగా ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండిపోతున్నారు. దాదాపు 150 కుటుంబాల ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రమాదకరమైన వరద దాటుకుంటూ వైద్యం కోసం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం స్పందించి కోడ పుట్టు వద్ద పీఎం జన్మన్ పథకం కింద వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
RAIN IN AP: రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు... నేలకొరిగిన పంట పొలాలు, చెట్లు
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం - రాబోయే 4 రోజులు పాటు వర్షాలు కురుస్తాయన్న అధికారులు - Rain Effect in AP