DSC Candidates Protest in Andhra Pradesh :ఐదేళ్లుగా నిరుద్యోగులను ఊరిస్తున్న డీఎస్సీ ఉద్యోగాలు విడుదల చేసిన ప్రభుత్వం కేవలం ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగతున్నాయి. నాడు అధికారంలో వచ్చేందుకు ఇష్టారీతిన హామీలు ఇచ్చి, ఓట్లు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి లేక విలవిల లాడుతుంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. నేడు అనంతపురంలో నిరుద్యోగ యువత కలెక్టర్ ఆఫీస్ బాట పట్టారు. తిరుపతిలోనూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకుని నిరుద్యోగులు నిరసన చేపట్టారు.
అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన - జగన్కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక
DSC Candidates Protest Demand Jobs Notification in Anantapur : అనంతపురంలో DSC అభ్యర్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మెగా DSC విడుదల చేయాలంటూ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ గేట్లు తోసుకొని లోనికి ప్రవేశించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత జగన్ నిరుద్యోగులను మోసం చేసేలా DSC నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. 6వేల 100 పోస్టుల్లో అనంతపురం జిల్లాకు కేవలం నాలుగు వస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే మెగా డీఎస్పీ ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.