తాగునీటి ఎద్దడితో విలవిలాడుతున్న ఒంగోలు వాసులు Drinking Water Crisis In Ongole: వేసవి రాకముందే ఒంగోలు నగర ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని శ్రీరామ్‌కాలనీ వాసులు తెలిపారు. నగరపాలక సంస్థ ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి నీటి ట్యాంకర్లకు ఏడాదికి కోటి 60 లక్షల రూపాయిలు కేటాయిస్తుంది. గుత్తేదారుల (Contractors)కు సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్నా నగరవాసుల నీటి కష్టాలు తీరకపోవడం ఇబ్బంది పడుతున్నారు. నగరపాలక అధికారులు కల్పించుకొని తాగునీటి సరఫరా సక్రమంగా ఇవ్వాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలు తన కష్టాలుగా, ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కడా లేనట్టుగా నీటి ఎద్దడి ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా చేస్తున్నామని చెప్తూ ఉంటారు. కానీ జగన్ చెప్పే మాటలకు క్షేత్రస్థాయి పనులకు ఏ మాత్రం పొంతన ఉండదు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో తాగునీటి కొరత (Water Crisis) తీవ్రంగా ఏర్పడింది. గత నెల రోజులుగా నగర శివారు ప్రాంతం శ్రీరామ్ కాలనీకి నీటి సరఫరా లేకపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Water Problem : పలు పట్టణాల్లో నీటి కొరత... దాహం తీరే దారేదీ?
వేసవి రాకముందే దాహానికి ఒంగోలు నగర ప్రజలు అల్లాడుతున్నారు. ఒంగోలు శ్రీరామ్ కాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీరామ్ కాలనీకి వారానికి ఒక్కసారి ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో ఆ కాలనీ వాసులకు నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. వారానికి ఒకసారి వచ్చే ట్యాంకర్ ద్వారా 5 ఇళ్లకు సరఫరా చేయటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'జీవనదులున్నా దొరకని నీరు.. పట్టించుకోని అధికారులు'
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవి కాలంలో ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఐదు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయాలి కానీ గత నెల రోజులుగా నీటి నిల్వలు తగ్గాయని, మోటార్లు చెడిపోయాయని సాకులు చెప్పి ఆరు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. అది కాకుండా నీటి ట్యాంకర్ వచ్చే ముందు కూడా అధికారులు సమాచారం ఇవ్వరని, ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియదని కాలనీవాసులు వెల్లడించారు. తాగునీటి పనులకు వెళ్లకుండా ఉండి నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. నగరపాలక సంస్థ ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి ట్యాంకర్లకు ఏడాదికి రూ. 1.60 కోట్లు కేటాయిస్తుంది. గుత్తేదారులకు సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్నా నగరవాసులకు నీటి కష్టాలు తీరకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పట్టించుకుని తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Water problem: వృథా నీరే.. ఆధారమాయె!