Devineni Uma Press Meet On Jagan Stone Attack Incident : ఓటమి భయంతోనే వెల్లంపల్లి శ్రీనివాసరావు బోండా ఉమాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ, విజయవాడ సీపీ వందల మంది పోలీసులతో ప్రజలను భయ బ్రాంత్రులకు గురిచేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. విజయవాడ సీపీ ఎవరి కళ్లల్లో ఆనందం చూడాలని కోరుకుంటున్నారో తెలియాలన్నారు.
దుర్గారావు ఎక్కడ? - సీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
విజయవాడ ఘటనలో సీపీ, ఐజీ, డీజీపీ సహా అందరూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో ఐదేళ్ల పాటు బెయిల్ కూడా రాకుండా శ్రీనుని ఎలా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని ఇప్పుడు శ్రీను లానే వడ్డెర పిల్లలని కూడా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో సీఎం ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లి వాగ్మూలం ఇవ్వలేదని గుర్తుచేశారు. జగన్ పై రాయి దాడి ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసికి ఫిర్యాదు చేశామని దేవినేని తెలిపారు.
Jagan Stone Attack Incident: సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికలకు ఆరునెలల ముందు విశాఖకపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తి డ్రమా ఆడాడు. అప్పుడు రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై నమ్మకంలేదని హైదరాబాద్కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఆ కుట్లు వేసిన డాక్టర్ రాష్ట మెడికల్ కార్పోరేషన్కి ఛైర్మన్ అయ్యారు. కోడి కత్తి శ్రీను ఐదు సంవత్సరాలు జైలులో మగ్గి కొద్దిరోజుల కిందటే బయటికి వచ్చారు. ప్రజలను నమ్మించాలంటే ఈ డ్రమా కూడా సరిపోదని సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు బాబాయ్ హత్య కేసు వెలుగులోకి తెచ్చారు. ఈ రెండు కుట్రలను అడ్డుపెట్టుకొని ప్రజల వద్ద సానుభూతి ఓట్లు వేయించుకుని జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.