ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం ఆఫీస్​లో మంత్రులు పవన్, అనిత భేటీ - ఇద్దరూ ఏం చర్చించారంటే! - PAWAN KALYAN ANITHA MEET

ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న పవన్ కల్యాణ్‌, అనిత

Pawan_Kalyan_Anitha_Meet
Pawan Kalyan Anitha Meet (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 5:33 PM IST

Updated : Nov 7, 2024, 6:30 PM IST

Deputy CM Pawan Home Minister Anitha Meet :డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోం శాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి అనిత తీసుకెళ్లారు.

చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు అనిత తెలిపారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమని నేతలు చర్చించుకున్నారు. తానూ ఫేక్ పోస్టు బాధితురాలునే అంటూ అనిత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో అన్నారు. అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ వివరాలను సైతం సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్​ చర్చించారు. హోమ్ మంత్రి అనిత, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ భేటీలో పాల్గొన్నారు.

Pawan Kalyan Anitha Meet (ETV Bharat)

కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని: తన కుమార్తె కన్నీరు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే తానే హోంమంత్రి పదవి సైతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాష్ట్రంలో అధికారులపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, అధికారి నిజాయతీతో ఉండాలని సూచించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. పవన్​ కల్యాణ్​తో భేటీపై హోంమంత్రి అనిత సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు.

తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​, హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి కార్యాలయంలో కలుసుకోవడంతో పాటు, సరదాగా నవ్వుతూ కనిపించారు. అదే విధంగా తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సైతం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వాటిని చూసి వారు కన్నీరు పెట్టుకోవడంతో ఆవేదన చెందానని పవన్ వెల్లడించారు. ఇంట్లోంచి బయటకు రావడానికి తన బిడ్డలు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని హోంమంత్రి అనితతో కూడా పవన్ చెప్పారు. పవన్ కల్యాణ్​, అనిత భీటీతో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని మరోసారి చెప్పకనే చెప్పినట్లైంది. దీంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైఎస్సార్సీపీకి తాజా ఫొటోలతోనే సమాధానం చెప్పారు.

సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కంటతడి పెట్టారు : పవన్ కల్యాణ్

అఘాయిత్యాలు ఇంకా కొనసాగితే నేనే హోంమంత్రి అవుతా - పోలీసులు ఏం చేస్తున్నారు? : పవన్ కల్యాణ్

Last Updated : Nov 7, 2024, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details