ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయ్ పొలిటికల్ ఎంట్రీ - పవన్ కల్యాణ్ మనసులో మాట ఏమిటంటే! - PAWAN KALYAN CONGRATULATES VIJAY

తమిళ నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై పవన్‌ కల్యాణ్‌ స్పందించి ఎక్స్‌(X) వేదికగా పోస్ట్‌ పెట్టారు

pawan_kalyan_congratulates_vijay
pawan_kalyan_congratulates_vijay (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 6:58 PM IST

Pawan Kalyan Congratulates Vijay on his Political Entry:తమిళ నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. విజయ్​కి అభినందనలు తెలుపుతూ ఎక్స్‌(X) వేదికగా పవన్ పోస్ట్‌ పెట్టారు. 'ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని పట్ల ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ అభిమానులు పవన్ కల్యణ్​కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Actor Vijay First Political Speech :ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీని స్థాపించారు. ఆదివారం టీవీకే పార్టీ తొలి మహానాడు సభ జరిగింది. తన పొలిటికల్‌ ఎంట్రీని ఉద్దేశించి విజయ్ సుదీర్ఘంగా ప్రసంగించారు.

కొండపల్లి కళాకారులకు పవన్​ శుభవార్త - ఆ చెట్లు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం

నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి వచ్చా: ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని తమిళనాడుకు ఇవి రెండు కళ్లులాంటివని విజయ్ అన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ భావజాలమని తెలిపారు. వాటి ఆధారంగానే పని చేస్తామని అన్నారు. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్‌, సక్సెస్‌ స్టోరీలు చదివాక నేను నా కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డానని అన్నారు. తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చని, కానీ పాలిటిక్స్ అంటే భయం లేదని విజయ్ అన్నారు.

రాజకీయం అనేది సినిమా రంగం లాంటిది కాదని, ఇది ఒక యుద్ధభూమి అని చెప్పారు. ఇక్కడ కొంచెం సీరియస్‌గానే ఉంటుందన్నారు. పాము అయినా, రాజకీయం అయినా దానిని సీరియస్‌గా తీసుకోవాలా? లేదా నవ్వుతూ చేతుల్లోకి తీసుకోవాలా? అనేది మనమే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ రంగాన్ని తాను ఎదుర్కోగలనని, నిలదొక్కుకోగలనని విజయ్‌ తెలిపారు. విల్లుపురం సమీపంలో టీవీకే పార్టీ మొదటి సభ(మాహానాడు) నిర్వహించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పార్టీ సిద్ధాంతాలను వివరించారు.

పవన్ కల్యాణ్ X ప్రకాశ్ రాజ్ - 'OG'లో ఇద్దరి మధ్య ఫైట్​ సీన్?

"ఓజీ ఓజీ అంటే 'మోదీ మోదీ' అని వినిపించేది" - పవన్ నోట హీరోల మాట - ఏమన్నారంటే!

ABOUT THE AUTHOR

...view details