Pawan kalyan About Tirumala Laddu Issue : తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఈ నేపథ్యంలో ‘ఎక్స్’లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం తెలిసి తీవ్ర కలత చెందానని ఉప మఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కోరారు.
ఆలయాల రక్షణపై మతాధిపతులు, న్యాయనిపుణులు, అన్ని వర్గాల ప్రతినిధులతో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. ఆలయాలపై జాతీయ స్థాయి విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలనూ దెబ్బతీసిందని పవన్ పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు- ముప్పేట దాడికి దిగిన రాజకీయ పార్టీలు - Tirupati Laddu Ghee Issue
వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో టీటీడీ మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరామణా రెడ్డి వెల్లడించారు. ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (ఫారిన్ ఫ్యాట్స్) కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైందని వివరించింది.
ఆ నివేదికలను విశ్లేషిస్తే విస్తుగొలిపేలా ఉన్నాయని పలువురు తెలిపారు. సాధారణ ఇంటి వాడకానికి కూడా వీటిని ఎవరూ అంగీకరించని స్థాయిలో ఉండటం గమనార్హం. కోట్ల మంది భక్తులు పరమపవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలోనే ఇలాంటివి ఉన్నాయంటే ఎంత ఘోరమో అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ నేతలు తిరుమల లడ్డూనూ అపవిత్రం చేశారా? - రాజకీయ దుమారం - FAT IN TIRUMALA LADDU ISSUE