Demolition of Building Illegally Constructed for YSRCP Office:గుంటూరు జిల్లా సీతానగరంలో నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతులు లేకుండా చేపట్టిన వైఎస్సార్సీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీఏ, ఎంటీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్ బోట్ యార్డు స్థలముంది. దీనిలో 2 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ హయాంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింAది. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో బకింగ్ హామ్ మెయిన్ కెనాల్ పక్కనున్న స్థలాన్ని తక్కువ ధరకే వైఎస్సార్సీపీ కొట్టేసింది.
ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ ధర 5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఏడాదికి ఎకరాకు కేవలం వెయ్యి చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతేడాది ఫిబ్రవరి 16న వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ జీవో బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు జీవో బయటికి రావడంతో స్థానికులు అప్పటి ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
మనకెందుకు అనుమతులు అనుకున్నారేమో- అక్రమనిర్మాణాలపై వైఎస్సార్సీపీకి నోటీసులు - GVMC Notices to YSRCP Office
అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి:తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ కట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో బోట్ యార్డ్ సమీపంలో వైఎస్సార్సీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణంపై అనుమతులు చూపించాలంటూ నోటీసులు జారీ చేశారు. వీటిపై వైఎస్సార్సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వారికి ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సాయంలో తెల్లవారుజాము నుంచే కూల్చివేత చేపట్టిన అధికారులు రెండున్నర గంటల్లోనే ప్రక్రియ పూర్తిచేశారు.
వైఎస్సార్సీపీ కార్యాలయ అక్రమ నిర్మాణాన్ని న్యాయస్థానం ఆదేశాలమేరకే కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టకపోతే కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. జలవనరుల శాఖ భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం కుదరదంటూ ఈఎన్సీ నారాయణరెడ్డి ఇచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.
నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన - రాష్ట్రవ్యాప్తంగా సమస్యలతో వస్తున్న ప్రజలు - Nara Lokesh Prajadarbar
వైఎస్సార్సీపీ సర్కార్‌లో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచ్‌లు - మంత్రి పవన్ కల్యాణ్‌పై కొత్త ఆశలు - YSRCP Govt Careless on Panchayats