Delhi Police Summons to Congress Leaders on Amit Shah Fake Video : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా విభాగానికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీశ్, ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. అమిత్‌షా మార్ఫింగ్ వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారని దిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నోటీసులపై వివరణ ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.
అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసు - పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు - AMIT SHAHFake VIDEO CASE - AMIT SHAHFAKE VIDEO CASE
Delhi Police Notices to Congress Leaders on Amit Shah Video : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియా మార్ఫింగ్ కేసులో దిల్లీ పోలీసులు, హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ మేరకు విచారణ చేపట్టారు. దిల్లీ పోలీసుల నోటీసులపై వివరణ ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 4:49 PM IST
|Updated : Apr 29, 2024, 7:03 PM IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరలవుతున్న కొన్ని ఫేక్ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.