ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఐఎన్ఎస్ సంధాయక్​' ను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ - రాజ్‌నాథ్‌ సింగ్‌

survey vessel INS Sandhayak: ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ సర్వే నౌకను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేశారు. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపకరిస్తుందని వివరించారు. దేశీయంగా యుద్ధ నౌక తయారీలో చరిత్ర సృష్టించడం ఆనందంగా వుందని రాజ్​నాథ్ పేర్కొన్నారు.

survey vessel INS Sandhayak
survey vessel INS Sandhayak

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 5:39 PM IST

survey vessel INS Sandhayak: ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేశారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెందార్క తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ జలాల్లో శాంతి సామరస్యం:హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతను భారత నౌకాదళం కల్పిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అన్నారు. భారతదేశం ప్రధానమైన లక్ష్యమైన శాంతి సామరస్యం, అంతర్జాతీయ జలాల్లో కూడా ఇది కాపాడే విధంగా భారత తన వంతు పాత్రను పోషించి పొరుగుదేశాలకు సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. మన జ్ఞానమే మన శక్తి అన్న ఆయన ఇదే అన్ని రంగాల్లోనూ మనం నిరూపిస్తున్నామన్నారు. మన ఉపనిషత్తులు కూడా ఇదే చెబుతున్నాయని స్మరించుకున్నారు. భారత నౌకాదళానికి ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజన్న అయన హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపకరిస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.


భారత నేవీ మాజీ అధికారులకు ఊరట- మరణశిక్ష రద్దు చేసిన ఖతార్ కోర్టు

హైడ్రోగ్రాఫిక్ సహాయికాగారిగా: తూర్పునౌకాదళం ప్రధాన స్ధావరంలో జరిగిన ఐఎన్ఎస్ సంధాయక్ ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిర్వహించారు. దేశీయంగా యుద్ధ నౌక తయారీలో చరిత్ర సృష్టించడం ఆనందం గా వుందని, ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రంలో వేలమైళ్ల దూరంలో సముద్రపు దొంగల బారిన , వారి చెర నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళానిదేనన్నారు. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగిందుకు భారత నౌకాదళం తన వంతుగా పూర్తి సహకారాన్ని అందరికీ అందిస్తుందన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ మాట్లాడుతూ, హైడ్రోగ్రాఫిక్ సహాయికాగారిగా అంతర్జాతీయ నౌకలకు కూడా ఇది ఉపయోగపడలన్న ప్రధాని మోదీ ఆకాంక్ష ను ఇది నెరవేరుస్తుందని పేర్కొన్నారు.


ఆపరేషన్ సక్సెస్​- హైజాక్‌కు గురైన నౌకలోని సిబ్బందిని రక్షించిన నేవీ

కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌ బిల్డింగ్‌ ఇంజినీర్స్‌: (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను నిర్మించింది. 2021 వరకు కొనసాగిన సంధాయక్ నౌక స్థానంలో, ఈ కొత్త నౌకను ఉపయోగించనున్నారు. అంతర్జాతీయ ప్రాదేశిక మాపింగ్ కోసం దీనిని వినియోగిస్తారు. 110 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 4130 టన్నుల బరువు, 18 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ నౌక , 3.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. హెలిపాడ్‌, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్‌ యంత్రాలు అమర్చారు. సంధాయక్‌ నౌకకు కమాండింగ్‌ అధికారిగా కెప్టెన్‌ ఆర్.ఎం.థామస్‌ వ్యవహరించనున్నారు.

సముద్రపు దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ- 19 మంది సేఫ్

ABOUT THE AUTHOR

...view details