CV ANAND APOLOGY TO NATIONAL MEDIA: సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగిందో వివరిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసిందే. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో వివరిస్తూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఈక్రమంలో మీడియా సీవీ ఆనంద్ని కొన్ని విషయాలపై ప్రశ్నించగా, నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్న కొందరు విలేకరులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేషనల్ మీడియాకి క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై నేషనల్ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ప్రెస్‌మీట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను కాస్త సహనాన్ని కోల్పోయానని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుందని, అయితే తాను చేసింది పొరబాటుగా భావిస్తున్నానని తెలిపారు. నేషనల్ మీడియాపై తన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నాని, క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.
సంధ్య థియేటర్ ఘటన - లైవ్ వీడియో విడుదల చేసిన పోలీసులు