ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక అమరావతికి కొత్త కళ - యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు - CRDA Started Work in Capital - CRDA STARTED WORK IN CAPITAL

CRDA started work in capital Amaravati: విధ్వంస పాలకుడి అరాచకానికి ఇన్నాళ్లూ ప్రత్యక్ష నిదర్శంగా నిలిచిన రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపిరి పీల్చుకుంటోంది. రాజధాని అమరావతిలో గడచిన ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా, దాన్నో చిట్టడివిలా మార్చేసిన సీఆర్‌డీఏలో కదలిక మొదలైంది. రాజధానిలో పిచ్చిమొక్కలు తొలగించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. రాజధానికి ప్రమాణస్వీకారం చేసినచోట ఏర్పాటు చేసిన గ్యాలరీని వైఎస్సార్​సీపీ హయాంలో దుండగులు ధ్వంసం చేసినా చీమకుట్టినట్టయినా లేని సీఆర్‌డీఏ అధికారులు ఆదివారం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, గ్యాలరీని పునరుద్ధరించే పనులు హుటాహుటిన చేస్తున్నారు. సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆదివారం రాజధానిలో పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించారు.

capital_works
capital_works (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 7:10 AM IST

ఇక అమరావతికి కొత్త కళ - యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు (ETV Bharat)

CRDA started work in capital Amaravati:వైఎస్సార్​సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో సీఆర్డీఏ ఆఘమేఘాలపై పనులు ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో ముళ్ల కంపల తొలగింపు పనులు మూడు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 పొక్లైన్లతో 109 కి.మీ.నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

కరకట్టపై వెలగని విద్యుద్దీపాలను సీఆర్డీఏ సిబ్బంది మారుస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రెండు దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్‌ లైటింగ్‌ ప్రాజెక్టును తాజాగా పూర్తి చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి. వీటిని శుభ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్‌మెంట్లు, విట్‌ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, నవులూరులోని ఎంఐజీ లేఔట్, స్టేడియం, శాఖమూరు పార్కు, ఎన్‌ఐడీకి వెళ్లే మార్గాల్లో పెరిగిన ముళ్లచెట్లను కూడా తొలగిస్తున్నారు.

ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం - Union Ministers From AP

అమరావతిలో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు రెండు గంటల పాటు పర్యటించారు. ఆగిపోయిన భవన సదుపాయాలు, కట్టడాలను పరిశీలించారు. కరకట్ట రోడ్డు నుంచి మొదలుపెట్టి సీడ్‌యాక్సెస్‌ రహదారిపై ఉన్న సెంట్రల్‌ లైటింగ్‌ను పరిశీలించారు. విద్యుద్దీపాల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ రాజధానికి భూమిపూజ జరిగిన ప్రాంతం, శంకుస్థాపన శిలాఫలకాలు, పవిత్ర మట్టి, నీరు, అమరావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు.

విజయవాడలోని సీఆర్డీఏ కీలక విభాగాలను ప్రాజెక్టు కార్యాలయంలోకి తరలించాలని సూచించారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కట్టడాల పరిస్థితి గురించి సీఆర్డీఏ అధికారులను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే లోపు రాజధానిలో పరిశుభ్రత పనులను పూర్తి చేస్తామన్నారు. భవనాల నాణ్యత పై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

రామోజీరావు పాడె మోసిన టీడీపీ అధినేత చంద్రబాబు - Chandrababu Tribute to Ramoji

సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ వ్యవహారశైలిపై రాజధాని రైతులు, మహిళలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా కమిషనర్‌ అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్షిక కౌలు, ప్లాట్ల అభివృద్ధిపై తాము విజయవాడలోని ఆయనను కలిసి విన్నవించేందుకు ప్రయత్నించినా సరిగా స్పందించలేదన్నారు. అనేకసార్లు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత వార్షిక కౌలును త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు సీఎస్‌ హామీ ఇచ్చారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనుల చేపట్టడాన్ని రాజధాని రైతులు స్వాగతిస్తున్నారు. జగన్ పాలనలో జేసీబీలు కూల్చటం కోసం వాడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాల కోసం వినియోగిస్తోందని అభిప్రాయపడ్డారు.

గుడివాడలో గడ్డం గ్యాంగ్​కు షాక్ - ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకున్న ప్రజలు - Kodali Nani Followers Occupy Land

ABOUT THE AUTHOR

...view details