ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో కచ్చు పీతలు - రేటెంతో తెలుసా? - RARE CRAB SPOTTED

గోదావరిలో మత్స్యకారుడి వలకు చిక్కిన కచ్చు పీతలు

crabs_caught_by_fisherman_in_godavari_kakinada_district
crabs_caught_by_fisherman_in_godavari_kakinada_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Crabs Caught by Fisherman in Godavari Kakinada District :కాకినాడ జిల్లా కోరంగి సమీపంలోని గోదావరిలో మత్స్యకారుడి వలలో అరుదైన పీతలు చిక్కాయి. ఆదివారం తమ వలలో రెండు కచ్చు పీతలు చిక్కాయని, ఒక్కో కచ్చు పీత ఖరీదు రూ.400 ఉంటుందని జాలరి తెలిపాడు. ఈ రెండింటి గుడ్లతో మరిన్ని పీతలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని జాలరి ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ పీతలు చూడటానికి సాధారణంగానే ఉన్నప్పటికీ వీటి గుడ్లు (Eggs) ఎర్రగా ఉన్నాయి. ఈ గుడ్లను నీటిలో వదులుతాయి. అవి వేలాది పీత పిల్లలు అవుతాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పండి, పొర గ్రామాల్లో పీతల పెంపకం క్షేత్రాలున్నాయి. ఆ క్షేత్రాల్లో కచ్చుపీతలను చెరువుల్లోకి వదిలి ఆ గుడ్ల ద్వారా వచ్చే చిన్న పీత పిల్లలను పెంచుతారు. ఇవి నాలుగు నెలల్లో అరకేజీ నుంచి కేజీ పీతలుగా ఎదుగుతాయని మత్స్యకారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details