YS Sharmila Election Campaign In kadapa :ఎన్నికలు దగ్గర పడుతుండటంలో వైఎస్సార్ జిల్లా కమలాపురంలో వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప యోగి వేమన వర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు. కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా నింపేందుకు పలుగు, పార పట్టి మట్టి తవ్వారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఉపాధి హామీ కూలీల వేతనం రూ.400కు పెంచుతాం హామీ ఇచ్చారు. సీఎం జగన్ బటన్ నొక్కుతున్నా అంటూ ఉన్నది గుంజుకున్నారని, ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.
షర్మిలపై కేసు పెట్టిన ఏపీ పోలీసులు- వివేకా హత్యపై మాటలే కారణమట! - case filed on ys sharmila
అవినాష్‌ను చిన్నపిల్లోడు, అమాయకుడు అని జగన్ అంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి అమాయకుడని రవీంద్రనాథ్‌రెడ్డి, జగన్ ఇద్దరూ చెబుతున్నారని, వీళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా? అని నిలదీశారు.