ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 10:21 PM IST

ETV Bharat / state

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సీఎం రేవంత్​ అభినందనలు - REVANTH REACTS TO AP ELECTION RESULT

రాష్ట్ర​ శాసనసభ ఎన్నికల సమరంలో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం కైవసం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్​ కల్యాణ్​లకు శుభాకాంక్షలు తెలిపారు.​ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని రేవంత్ రెడ్డి కోరారు.

CM Revanth Wishes to Chandrababu, Pawan Kalyan
CM Revanth Wishes to Chandrababu, Pawan Kalyan (ETV Bharat)

CM Revanth Wishes to Chandrababu, Pawan Kalyan : రాష్ట్ర​ శాసనసభ ఎన్నికల సమరంలో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం కైవసం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి స్పందించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్​ కల్యాణ్​లకు తెలంగాణ సీఎం రేవంత్​ శుభాకాంక్షలు తెలిపారు.​ ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలని సీఎం ఆకాంక్షించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని రేవంత్ రెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details