ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం' - సంధ్య థియేటర్​ ఘటనపై రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు - REVANTH SENSATIONAL COMMENTS

సంధ్య థియేటర్​ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ - ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందన్న సీఎం

cm_on_sandhya_theater_incident.
cm_on_sandhya_theater_incident. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2024, 4:28 PM IST

Updated : Dec 21, 2024, 5:22 PM IST

CM Revanth Reddy on Sandhya Theater incident:తెలంగాణ రాష్ట్రంలో అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించనని తేల్చిచేప్పారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత అని సీఎం వెల్లడించారు. సంధ్య థియేటర్​ ఘటనపై చర్చ సందర్భంగా ఘాటు సీఎం రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

మీరు సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు, షూటింగ్‌లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సినీ ప్రముఖులను సీఎం హెచ్చరించారు.

భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పినా: సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని సీఎం రేవంత్ వివరించారు. ఈ నెల 2న చిక్కడపల్లి పీఎస్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేశారని తెలిపారు. ఈ నెల 4న పుష్ప-2 విడుదల అవుతుందని ఈ క్రమంలో అక్కడకు హీరో, హీరోయిన్, సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని కావున బందోబస్తు కావాలని పోలీసులను థియేటర్ యాజమాన్యం కోరిందని వివరించారు. ఈ నెల 3వ తేదీన సంధ్య థియేటర్‌ రాసిన లేఖకు పోలీసులు రాతపూర్వక సమాధానం ఇచ్చారని అన్నారు. సంధ్యా థియేటర్‌కు వెళ్లి, రావడానికి ఒకే మార్గం ఉందని పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని పోలీసులు చెప్పినట్లు సీఎం తెలిపారు.

చేతులు ఊపుతా ర్యాలీ: సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖను పోలీసులు తిరస్కరించినట్లు సీఎం వెల్లడించారు. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్‌ థియేటర్‌కు రావొద్దని చెప్పినా సరే అక్కడకు వచ్చి వాహనం రూఫ్‌టాప్​ నుంచి చేతులు ఊపుతా ర్యాలీ చేశారని అన్నారు. పోలీసులు దరఖాస్తు తిరస్కరించినా రాత్రి 9.30 గంటల సమయంలో హీరో థియేటర్‌కు వచ్చారని తెలిపారు. నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదే లేదో నాకు తెలీదని సీఎం రేవంత్ అన్నారు. ఎక్స్‌రోడ్డు చౌరస్తా ముందే నుంచి రూఫ్‌టాప్​ ద్వారా అల్లు అర్జున్ రోడ్‌ షో చేస్తూ థియేటర్‌కు రాగా ఆ సమయంలో చుట్టూ ఉన్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న అభిమానులు వేలాదిగా ఒకేసారి ఇక్కడికే వచ్చారని తెలిపారు.

'RGV సినిమా ఒక్కసారి చూస్తే రూ.11వేలు' - నోటీసులు పంపిన APSFL

హీరోకి చెప్పినా వినలేదు:హీరోను చూడాలి కలవాలని అభిమానులు రావడంతో తోపులాట జరిగిందని ఈ ఘటనలో తల్లి రేవతి మరణించగా కుమారుడికి గాయాలు అయ్యాయని అన్నారు. ఘటన జరిగిన వెంటనే తల్లి, కుమారుడిని రక్షించేందుకు పోలీసులు యత్నించారని తెలిపారు. బయట జరిగిన ఉదంతాన్ని హీరోకు చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారని కానీ హీరో వద్దకు వెళ్లేందుకు ఏసీపీకి కూడా థియేటర్ సిబ్బంది అనుమతి ఇవ్వలేదని అన్నారు. థియేటర్ సిబ్బంది తీరుపై పోలీసులు ఆగ్రహించి చివరకు హీరో వద్దకు వెళ్లారని థియేటర్‌ బయట ఉన్న వేలాదిమందిని అభిమానులను నియంత్రించలేక శాంతిభద్రతలు చేజారిపోయాయని పోలీసులు చెప్పి థియేటర్ నుంచి వెళ్లిపోవాలని హీరోను ఏసీపీ కోరారని తెలిపారు. అప్పుడు సినిమా పూర్తయ్యేంతవరకు ఉంటానని హీరో చెప్పినట్లు సిటీ కమిషనర్‌ నాతో చెప్పారని సీఎం వెల్లడించారు.

థియేటర్ బయట ఉన్న పరిస్థితి దృష్ట్యా డీసీపీ నేరుగా హీరో వద్దకు వెళ్లి బయట ఒకరు చనిపోయారు, మీరు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. వెళ్లకపోతే పీఎస్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుందని హీరోకు చెప్పగా దీంతో రాత్రి 12 గంటలకు థియేటర్‌ నుంచి బయటకు వచ్చారు. తల్లి చనిపోయిందని, బాలుడు చావు బతుకుల మధ్య ఉన్నారని పరిస్థితి బాగాలేదని చెప్పినా అల్లు అర్జున్ వాహనంపైకి ఎక్కి చేతులు ఊపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు.- రేవంత్​ రెడ్డి, సీఎం

ఇదెక్కడి మానవత్వం: 11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో, నిర్మాత వెళ్లలేదని అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ రకమైన మానవత్వం అని ప్రశ్నించారు. మానవత్వం లేని వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ హీరో దైవస్వరూపుడు ఆయనను ముట్టుకుంటారా అంటూ ఒక నేత ట్వీట్​ చేశారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో షూటింగ్​లు జరగవద్దన్న నేతలు ఆ హీరోను భగవత్​ స్వరూపుడు అన్నారని ఆగ్రహించారు. చనిపోయిన వారి ప్రాణాలకు విలువ లేకుండా చావుకు కారణమైన వారిని పీఎస్​కు తీసుకెళ్తే తప్పుపడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఘటనలో ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నించారని అన్నారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని టికెట్ల రేట్లు పెంచుకునేందుకు, స్పెషల్​ షోలకు అనుమతి ఇచ్చామని సీఎం రేవంత్​ రెడ్డి అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.

'అందుకే అల్లు అర్జున్ రాలేదు' - బాలుడిని పరామర్శించిన అల్లు అరవింద్

'సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా' - అల్లు అర్జున్ ఘటనపై కేటీఆర్ ఫైర్

Last Updated : Dec 21, 2024, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details