ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంకా పెండింగ్‌లోనే వెలిగొండ పనులు - హడావుడిగా రెండో టెన్నెల్‌ ప్రారంభం - పెండింగ్‌లో వెలిగొండ పనులు

Veligonda second tunnel: వెలిగొండ రెండో టెన్నెల్‌ ప్రారంభోత్సవ వేళ సీఎం నోటి వెంట అబద్ధాలు హోరెత్తాయి. ప్రాజెక్టు పనులన్నీ తన హయాంలోనే చకచకా పరుగులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. సీఎం తన ప్రసంగంలో అవాస్తవాలు చెప్పి, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Veligonda second tunnel
Veligonda second tunnel

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 8:00 AM IST

ఇంకా పెండింగ్‌లోనే వెలిగొండ పనులు - హడావుడిగా రెండో టెన్నెల్‌ ప్రారంభం

Veligonda second tunnel: వెలిగొండ రెండో టెన్నెల్‌ ప్రారంభోత్సవ వేళ సీఎం నోటి వెంట అబద్ధాలు హోరెత్తాయి. ప్రాజెక్టు పనులన్నీ తన హయాంలోనే చకచకా పరుగులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. సీఎం తన ప్రసంగంలో అవాస్తవాలు చెప్పి, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇది దేవుడి స్ర్కిప్టో కాదో తెలియదు గానీ, సీఎం చదివిని స్క్రిప్ట్‌లో మాత్రం అబద్ధాలు వల్లెవేసి, ప్రజల్ని తప్పుదోవపట్టించారు. వాస్తవానికి 1996లోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. గొట్టిపడియ ఆనకట్ట వద్ద తొలుత 980 కోట్ల అంచనా వ్యయంతో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించారు. ఆ తరువాత 2004 అక్టోబరులో సుంకేసుల వద్ద 5వేల 500 కోట్ల అంచనాతో మరోసారి శంకుస్థాపన చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు: వాస్తవానికి 2019 నాటికే మొదటి సొరంగం 17.8 కిలోమీటర్ల మేర పూర్తయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక కిలోమీటరు పనులు మాత్రమే చేసింది. రెండో సొరంగాన్ని 11 కిలోమీటర్లు తవ్వింది. టీడీపీ హయాంలో మొదటి, రెండో సొరంగాల పనులు నిబంధనల మేరకు, టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో తవ్వి వ్యర్థాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటికి పంపారు. సెగ్మెంట్లతో లైనింగ్‌ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం తొలి సొరంగంలో దాదాపు కిలోమీటరు, రెండో సొరంగంలో 7.8 కిలోమీటర్ల పనులను నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపట్టి మాన్యువల్‌గా చేసింది. తవ్విన వ్యర్థాలను సైతం తొలగించకుండా మొదటి సొరంగంలో వేసి పనులు పూర్తి చేశామని చెబుతోంది.
ఉత్తుత్తి ప్రారంభోత్సవాలతో రైతులు సంతోషిస్తారా జగన్​ ?: టీడీపీ

7555 మంది నిర్వాసితులు: ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వెలిగొండ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా ఫీడర్‌ కాలువ లైనింగ్, కొన్నిచోట్ల వంతెనల నిర్మాణమే పూర్తి కాలేదు. తూర్పు ప్రధాన కాలువ, తీగలేరు కాలువ పనులు, వంతెనలు, హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ జగన్‌ మాత్రం మళ్లీ అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలల్లోనే ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు నింపుతామని చెప్పడం విడ్డూరంగా ఉంది. మరోవైపు నల్లమల సాగర్‌ పరిధిలో ముంపు గ్రామాలను ఇంకా ఖాళీ చేయించలేదు. సుమారు 7వేల555 మంది నిర్వాసితులకు ఈరి అండ్‌ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 96 మందికే అందజేశారు. పునరావాసంపై స్పష్టత లేక నిర్వాసితులు అయోమయంలో ఉన్నారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేదు. కొన్నిచోట్ల ఇప్పటికీ పట్టాలు పంపిణీ చేయలేదు.

ఖరీఫ్‌కు నీళ్లిస్తామని చెబుతున్నారు: అధికారంలోకి రాగానే ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీలు గుప్పించారు. 2020 ఫిబ్రవరి 20న పనులను సమీక్షించి అదే ఏడాది ఆగస్టుకు నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తర్వాత అనేకసార్లు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఇప్పటికీ నీళ్లు ఇవ్వలేదు. తాజాగా వచ్చే ఖరీఫ్‌కు నీళ్లిస్తామని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌పై ఆధారపడి నిర్మించారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీళ్లు లేవు. ఆ జలాశయం నిండకుండా నీళ్లు ఎలా తెచ్చి నల్లమల సాగర్‌ను నింపుతారనే దానిపై స్పష్టత లేదు. సొరంగాల వరకు నీళ్లు తెచ్చినా ఫీడర్, ప్రధాన, మేజర్, మైనర్‌ కాలువలు పూర్తికాకుండా పొలాలకు ఎలా సరఫరా చేస్తారనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

వెలిగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగాన్ని ప్రారంభించిన సీఎం జగన్ - నిర్వాసితులను ఆదుకుంటామని భరోసా

ABOUT THE AUTHOR

...view details