CM Jagan will come to Sarada Peetham Anniversary: విశాఖలో బుధవారం శారదా పీఠం వార్షికోత్సవానికి రానున్న ముఖ్యమంత్రి జగన్కు ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం సీఎం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శారదాపీఠం వరకు 10 కిలోమీటర్ల మేర దాదాపు 24 ప్రాంతాల్లో మహిళలను రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి స్వాగతం పలికించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి జోన్, వార్డులకు పరిధిలో ఎంత జనసమీకరణ చేయాలి, మహిళలను ఏ కూడళ్ల వద్ద ఎంతమందిని నిలబెట్టాలనే వివరాలతో ఏకంగా ఓ పట్టిక రూపొందించారు. ఆర్‌పీలు ఇప్పటికే మహిళా సంఘాలకు వాట్సప్ గ్రూపుల్లో ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రూపు నుంచి సభ్యులంతా తప్పకుండా హాజరవ్వాలని లేదంటే రుణాల మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
'అన్నొస్తే అన్నీ కష్టాలే' - గాల్లో వెళ్లే సీఎం కోసం రోడ్లపై ప్రజలకు అవస్థలు
CM Jagan Come People Suffering in Traffic: ఇటీవల నగరంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు తుస్సుమనడంతో సీఎం జగన్ కస్సుబుస్సులాడారు. ఆ రోజు స్టేడియంలో జనాలు లేకపోవడంతో ముఖ్యమంత్రి ముభావంగానే కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయారు. వారం వ్యవధిలోనే ఆయన నగరానికి రానుండటంతో అధికారులు ఈసారి జన సమీకరణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశారు. పట్టణ సామాజిక అభివృద్ధి అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించారు. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు దంచేస్తున్నాయి. పగటి వేడిమి ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఇలాంటి సమయంలో సుమారు 10 కి.మీ మేర మహిళలను మిట్టమధ్నాహ్న సమయంలో రోడ్ల మీద నిలబెట్టడం అత్యుత్సాహమే అవుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.